వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపదసోపానమటమని కూడా వ్యవహరిస్తారు. వైకుంఠపాళీ పటంలో 132 గళ్ళు ఉంటాయి. ఈ గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. ఈ గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి. అది పాతాళమనీ, ఆ ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ) ని ఆ ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం. వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 74, 79, 87 సంఖ్యలు గల గళ్ళల్లో నిచ్చెనలు ఉన్నాయి.
ఏ పందానికైనా ఆటకోసం ఆడే వస్తువు ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న నిచ్చెన సాయంతో పై గడికి చేరుకోవచ్చు. నిచ్చెన ఎక్కే అవకాశం వచ్చినప్పుడు మరోసారి కూడా మనకే ఆడే ఛాన్స్ ఉంటుంది. అదే సమయంలో పాము తల దగ్గరికి మనం ఆడే వస్తువు వస్తే పాము కరిచి/మింగి పాము తోక చివరివరకూ కిందికి దిగిపోతాము. ఇలా కిందకు పైకి పోతూ, చివరకు అనుకున్న చోటుకు వెళ్ళే ఆటనే ఇది.
