హర్ముజ్ జలసంధిలో అమెరికా సైన్యం ఒక రహస్య షిప్పింగ్ కారిడార్‌ను నిర్వహిస్తున్నట్లు అమెరికా పత్రిక సంచలన కథనం ప్రచురించింది. కాల్పుల విరమణను కొనసాగించడానికి ట్రంప్ నిరాకరించిన నేపథ్యంలో ఈ వ్యూహం వెలుగులోకి వచ్చింది.
గత కొన్ని వారాలుగా అమెరికా దళాలు ప్రతిరోజూ రాత్రి సమయంలో రహస్యంగా 15 నుండి 20 వరకు ట్యాంకర్లను సురక్షితంగా హర్ముజ్ జలసంధి దాటిస్తున్నట్లు సమాచారం. ఒమన్ తీరానికి సమీపంలోని దక్షిణ ఛానెల్ మార్గాన్ని ఇందుకు ఉపయోగిస్తున్నారు. ఈ లెక్కన రోజుకు కనీసం కోటి బ్యారెళ్ల చమురు అందుబాటులోకి వస్తోంది. ఇది యుద్ధానికి ముందు సరఫరా అయ్యే చమురులో సగానికి సమానం.
దీంతో పాటు ఖాళీ ట్యాంకర్లు తిరిగి గల్ఫ్ దేశాల్లోని రేవులకు వెళ్లి చమురు నింపుకొని వచ్చేందుకు అమెరికా సైన్యం సహాయం చేస్తోంది. ఈ మొత్తం ఆపరేషన్‌ను అమెరికాలోని నార్త్ కరోలినా ఫోర్ట్ బ్రాగ్లోని అమెరికా టాస్క్ ఫోర్స్ సమన్వయం చేస్తుండగా, గల్ఫ్ దేశాల నుంచి కూడా సహకారం లభిస్తోంది. టాస్క్ ఫోర్స్ నిర్దేశిత సమయాల్లోనే ట్యాంకర్ల కాన్వాయ్‌లు కదులుతున్నాయి.
