అగ్ర కథానాయకుడు చిరంజీవి ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ చిత్ర యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ను ఇచ్చింది. ఈ చిత్రానికి ‘కాకా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ ఓ వీడియోను షేర్ చేశారు. ఇందులో చిరంజీవి పూర్తి భిన్నంగా మధ్యతరగతి వ్యక్తిగా కనిపిస్తున్నారు.
ఈ చిత్రంలో చిరంజీవి అక్వా సంస్థలో ఉద్యోగిగా సత్యం అనే పాత్రలో నటిస్తుండగా, ‘ఇది సత్యం మాట.. ఇంకా డౌటా’ అనే డైలాగు ఆయన పాత్ర స్వభావాన్ని తెలియజేస్తోంది. ఇందులో కనిపించిన ‘ఐ లవ్ డాడీ’ అనే కీ చైన్‌ను బట్టి, ఫ్లాష్‌బ్యాక్‌లో ఆయనకు తండ్రితో బలమైన అనుబంధం ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
టైటిల్ రివీల్ అనంతరం యంగ్ అండ్ స్టైలిష్ లుక్‌లో గన్స్ పేలుస్తూ చిరంజీవి ఇచ్చిన మాస్ పోజు మెగా ఫ్యాన్స్‌కు వింటేజ్ చిరును గుర్తుచేస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ విజయం తర్వాత చిరు – బాబీ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాను ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ముస్తాబు చేస్తుండగా, ఇది సంక్రాంతి కానుకగా 2027 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
