నేచురల్ స్టార్ నాని హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై-వోల్టేజ్ మాస్ యాక్షన్ మూవీ ‘ప్యారడైజ్’ (Paradise). ఈ చిత్రానికి సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ సరికొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలోని సంగీతానికి సంబంధించి ఒక అరుదైన మైలురాయిని దాటినట్లు పోస్టర్లో ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన అనిరుధ్ మ్యూజికల్ కంటెంట్ ఏకంగా 200 మిలియన్లకు పైగా వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో నిలిచింది. ఈ మేరకు పోస్టర్ పైభాగంలో ‘200+ Million Views’ అని హైలైట్ చేశారు.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV Cinemas) పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా.. ఇషాన్ సక్సేనా కో-ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి ఎన్ఐఎస్ (CH Sai), ఎడిటర్ నవీన్ నూలి (Navin Nooli), ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా (Avinash Kolla), , అజయ్ కుమార్ జె (Ajay Kumar J) సాంకేతిక నిపుణులుగా పనిచేస్తున్నారు. నాని మాస్ గెటప్ , ఊరమాస్ బ్యాక్‌డ్రాప్‌తో ఉన్న ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
