ఎన్నో ఆకాంక్షలతో నింగిలోకి పంపిన నాసా-ఇస్రో సంయుక్త సింథటిక్ రార్డర్ (నైసార్) ఉపగ్రహం.. నేపాల్ విలయాన్ని ముందే పసిగట్టకుండా నిద్రపోయిందంటూ వస్తున్న విమర్శలను ‘నైసార్’ పక్కన పెట్టింది. భూమిపై ఆకృతి, పరిమాణం, తదితర మార్పులను కొద్దివారాల కిందటే నైసార్ గుర్తించినట్లు స్పష్టమైంది. మంచు, కొండచర్యల కదలికలను ఈ శాటిలైట్ పక్కాగా గమనించింది. చైనాలోని చాంగన్ యూనివర్సిటీ పీహెచ్డీ విద్యార్థి జెంజియాంగ్ లీయు.. నైసార్ శాటిలైట్ చిత్రాల ఆధారంగా పలు కీలక విషయాలను వెల్లడించారు.
భారీ మార్పులకు లోనైనట్లు..
కొండచర్యలు విరిగిపడటానికి ముందు ఒక పర్వత వాలు భారీ మార్పులకు లోనైనట్లు ఆ చిత్రాల్లో స్పష్టమైంది. మంచు, శిలల మధ్య తీవ్రమైన ఒత్తిడి ఉన్న సమయంలో ఈ పరిస్థితి ఏర్పడుతుందని, హిమపాతం సంభవించిన ప్రాంతం నుంచి కొన్ని మీటర్ల మేర కదిలినట్లు తెలుస్తోందని ఆయన తెలిపారు. అయితే ఈ కదలిక అన్ని వైపులకు సమానంగా కాకుండా, నిటారుగా ఉన్న పర్వత వాలుపైనే కేంద్రీకృతమైనట్లు నైసార్ చిత్రాలను విశ్లేషించి తేల్చారు. ఈ భారీ కదిలిక కొండచర్యలు విరిగిపడతాయని ముందుగా హెచ్చరించే బలమైన సంకేతమని నిపుణులు పేర్కొన్నారు.
నైసార్ ప్రత్యేకతలు..
భారత్, అమెరికా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ‘నైసార్’ అత్యంత శక్తిమంతమైన భూ పరిశీలన ఉపగ్రహాలలో ఒకటిగా నిలిచింది. రెండు సింథటిక్ అపర్చర్ రార్లు అమర్చిన తొలి ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ప్రకృతి విపత్తులను ముందే పసిగట్టి, వాటిని సమర్థంగా ఎదుర్కొనే ఉద్దేశంతోనే గత ఏడాది ఈ శాటిలైట్‌ను ప్రయోగించారు. పగలు, రాత్రి తేడా లేకుండా మేఘాలు, వర్షం, పొగమంచు వంటి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇది అత్యంత స్పష్టమైన చిత్రాలను అందించగలదు.
