అమెరికాలోని బే ఏరియాలో ఉన్న సినీ ప్రియులను అలరించేందుకు ఆగస్టు నెలలో పలు క్రేజీ ప్రాజెక్ట్లు థియేటర్లలో సందడి చేయనున్నాయి. బే ఏరియాలో విడుదల కానున్న ఆ ప్రముఖ చిత్రాల వివరాలు తెలుసుకుందాం.
కొరియన్ కనకరాజు (Korean Kanakaraju): ఆగస్టు 7, 2026న విడుదల కానున్న ఈ చిత్రానికి మేర్లపాక గాంధీ డైరెక్టర్. వరుణ్ తేజ్, రితికా నాయక్ జంటగా నటిస్తున్న ఈ సినిమా కామెడీ-హర్రర్ జోనర్ తెరకెక్కింది.
విశ్వనాథ్ అండ్ సన్స్ (Vishwanath and Sons): ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న తమిళ-తెలుగు చిత్రం ఇది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య, మమిత బైజు తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఒక రొమాంటిక్ డ్రామాగా రూపొందింది.
ఇరుముడి (Irumudi): ఆగస్టు 21, 2026న విడుదల కానుసన్న ఈ యాక్షన్-డ్రామా చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. ఇందులో రవి తేజ, ప్రియా భవాని శంకర్ జంటగా నటిస్తున్నారు.
అమీర్ లాగ్ (Ameer Log): ఆగస్టు 21, 2026న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా హైదరాబాద్ పాతబస్తీ నేపథ్యంలో సాగే స్నేహం ఆధారిత డ్రామా. దీనికి రమణారెడ్డి సోమ దర్శకత్వం వహించారు.
టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups): ఆగస్టు 26, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న హై-ప్రొఫైల్ పాన్-ఇండియన్ యాక్షన్-థ్రిల్లర్ ఇది. రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం పలు భాషల్లో ఏకకాలంలో భారీ స్థాయిలో విడుదల కానుంది.
