మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’కు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టర్లు, టీజర్లు, లేదా పాటలు రాకపోయినా, ఈ సినిమా పేరు మాత్రం నిరంతరం వినిపిస్తూనే ఉంది. తాజాగా దర్శకుడు వశిష్ట చేసిన ఒక సోషల్ మీడియా పోస్ట్ ఈ సినిమాపై అభిమానుల్లో ఉన్న ఆసక్తిని మరోసారి తారాస్థాయికి చేర్చింది.
వశిష్ట పోస్ట్ వెనుక అసలు అర్థం ఏంటి?
దర్శకుడు వశిష్ట శివుడికి సంబంధించిన ఒక ప్రవచన వీడియోను షేర్ చేస్తూ.. “శ్వాస నాది.. శాసనం నీది.. ఆశ నాది.. పాశం నీది.. ఆత్మ నాది.. ఆట నీది.. ఎంత మాయగాడివయ్యా.. ఇందుకేనా నిన్ను విశ్వంభరుడు అని పిలిచేది” అంటూ క్యాప్షన్ జోడించారు. చివర్లో ‘సర్వం శివం.. ఓం నమః శివాయ’ అని పేర్కొన్నారు. ముఖ్యంగా ‘విశ్వంభరుడు’ అనే పదాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించడంతో, ఇది సినిమా కథకు లేదా కాన్సెప్ట్‌కు సంబంధించిన సంకేతమేమోనని నెటిజన్లు, మెగా ఫ్యాన్స్ చర్చలు మొదలుపెట్టారు. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
భారీ అంచనాలు..
చిరంజీవి చాలా కాలం తర్వాత చేస్తున్న ఫాంటసీ కథా చిత్రం కావడంతో ‘విశ్వంభర’పై మొదటి నుంచీ భారీ అంచనాలు నెలకొన్నాయి. త్రిష, ఆషిక రంగనాథ్ ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఈ చిత్రంలో ప్రధానాంశం కావడంతో, మేకర్స్ పోస్ట్ ప్రొడక్షన్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టారు. సినిమా షూటింగ్ ఆలస్యం కావడం, రిలీజ్ డేట్‌పై ఇంకా స్పష్టత రాకపోవడంతో అభిమానులు కొత్త అప్డేట్ల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అధికారిక ప్రమోషన్స్ లేకపోయినా, దర్శకుడి పోస్టులు , సోషల్ మీడియా చర్చల ద్వారా ‘విశ్వంభర’ ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే మారుతుండటం విశేషం. ఈ తాజా పోస్ట్ చూశాక త్వరలోనే సినిమా నుంచి ఏదైనా మేజర్ అప్డేట్ వస్తుందని ఫ్యాన్స్ ఆశP పడుతున్నారు.
