అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్ వేదికగా అక్టోబర్ 3, 2026 నాడు అత్యంత ప్రతిష్టాత్మకంగా వరల్డ్స్ బెస్ట్ బిజినెస్ ఆపర్చునిటీ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే పేరుతో భారీ ఈవెంట్ నిర్వహించబడుతోంది. ప్రముఖుల ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి రమణ సంచుల ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తుండగా, ఆర్ఎండీ కుమార్ వుటకూరి గెస్ట్ స్పీకర్‌గా విచ్చేస్తున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమం గురించి నిర్వాహకులు, అతిథుల మధ్య జరిగిన విశేషాలను తెలుగు టైమ్స్ ప్రత్యేక ఇంటర్వ్యూ రూపంలో ఆయన వెల్లడించారు.
ఈవెంట్ నిర్వహణ…
బే ఏరియాలో తెలుగు, భారతీయ కమ్యూనిటీలకు చెందిన ఎంతో ప్రతిభావంతులైన నిపుణులు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. చాలామంది తమ వృత్తిపరమైన ఉద్యోగాలతో పాటు అదనపు ఆదాయం లేదా భవిష్యత్తు కోసం సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనతో ఉంటారని వెల్లడించారు. ఈ ఈవెంట్ ద్వారా అందరినీ ఒక్కచోట చేర్చి ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలోని అవకాశాలను పరిచయండమే ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రజలు ఎలాంటి ముందస్తు అభిప్రాయాలు లేకుండా వచ్చి, బిజినెస్ మోడల్‌ను అర్థం చేసుకుని, ఇప్పటికే ఈ రంగంలో రాణిస్తున్నవారితో మాట్లాడి సొంతంగా నిర్ణయం తీసుకోవచ్చని తెలిపారు. మన కమ్యూనిటీలో డాక్టర్లు, ఇంజినీర్లు, ఐటీ నిపుణులు, వ్యాపారవేత్తలు ఉన్నప్పటికీ, సంప్రదాయ ఉద్యోగాలకు వెలుపల ఉండే అద్భుతమైన వ్యాపార అవకాశాలపై అవగాహన కల్పించడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశమని వివరించారు.
కుమార్ వుటకూరి ప్రయాణం…
గెస్ట్ స్పీకర్‌గా హాజరవుతున్న కుమార్ వుటకూరి కార్పొరేట్ , వ్యాపార రంగంలో అపారమైన అనుభవం కలిగి ఉన్నారు. ఐటీ ఇండస్ట్రీలో అనేక సంవత్సరాలు పనిచేసి, ఆ తర్వాత ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఒక ఉద్యోగి స్థాయి నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా ఎదిగే ప్రయాణంలో ఎదురయ్యే అనుభవాలు, టీమ్ బిల్డింగ్, కుటుంబాలతో పనిచేయడం వంటి అంశాలపై ఆయన మాట్లాడనున్నారు. ఈ ప్రయాణం బే ఏరియాలోని ప్రొఫెషనల్స్‌కు ఎంతో స్ఫూర్తినిస్తుందని భావిస్తున్నారు.
ఔత్సాహిక వ్యాపారవేత్తలకు మార్గదర్శకం
ఎంట్రప్రెన్యూర్షిప్ అనేది సరైన మైండ్‌సెట్, విద్య, క్రమశిక్షణ, లీడర్షిప్ , మంచి సంబంధాలపై ఆధారపడి ఉంటుందనే సందేశాన్ని ఈ వేదిక ద్వారా యువతకు అందించనున్నారు. వ్యాపారం ప్రారంభించడానికి భారీ మూలధనం అవసరం లేదని, ప్రొఫెషనల్ లైసెన్సింగ్, ట్రైనింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్ వంటివే ముఖ్యమని ఈ సెషన్ ద్వారా తెలియజేయనున్నారు. విజయం ఒక్కరోధూ రాదని, నిలకడగా పనిచేస్తూ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదగడానికి సిద్ధంగా ఉండాలని నిర్వాహకులు సూచిస్తున్నారు.
ఫ్రీడమ్, జనరేషనల్ వెల్త్, రిసిడ్యువల్ ఆదాయం
కేవలం జీతం కోసం పనిచేయడం కాకుండా, కుటుంబ భద్రత, రిటైర్మెంట్ ప్లానింగ్, వెల్త్ అక్యుములేషన్ , భావితరాలకు సంపదను ఎలా అందించాలనే అంశాలపై చర్చిస్తారు. ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో టీమ్-బేస్డ్ ఆర్గనైజేషన్ ఎలా పనిచేస్తుంది, కమిషన్లు , ఓవర్‌రైడ్ కాంపెన్సేషన్ విధానాల గురించి స్పష్టత ఇస్తారు. తక్షణ లేదా గ్యారెంటీడ్ ఆదాయం ఉంటుందని ఆశించకుండా, ఈ మోడల్‌ను పూర్తిగా అర్థం చేసుకోవాలని సూచిస్తున్నారు.
రియల్ స్ట్రాటజీస్, రియల్ పీపుల్, ప్రూవెన్ రిజల్ట్స్ అనే నినాదంతో ఈ కార్యక్రమం సాగనుంది. కుటుంబాలు , వ్యాపారాలు ఉపయోగించే ప్రాక్టికల్ ఫైనాన్షియల్ కాన్సెప్ట్స్ ఇందులో నేర్చుకోవచ్చు. వివిధ ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవారు లైసెన్సులు పొంది, కస్టమర్లకు సేవలు అందిస్తూ లీడర్షిప్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకుంటున్న ఉదాహరణలను చర్చిస్తారు. విద్యతో పాటు లంచ్ , నెట్వర్కింగ్ సెషన్ ఉండటం వల్ల రాబోయే కాలంలో మంచి ప్రొఫెషనల్ సంబంధాలు ఏర్పడే అవకాశం ఉంది.
భవిష్యత్ ప్రణాళికలు…
అక్టోబర్ 3న జరిగే ఈ కార్యక్రమం కేవలం ఒక్కసారితో ఆగిపోదని, భవిష్యత్తులో మరిన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వర్క్‌షాప్‌లు, లీడర్షిప్ ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. బే ఏరియాలోని ప్రవాస భారతీయులు అందరూ ఈ కార్యక్రమానికి ఓపెన్ మైండ్‌తో వచ్చి, ఫైనాన్షియల్ ఇండస్ట్రీని అర్థం చేసుకుని, తమ భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోవాలని నిర్వాహకులు కోరుతున్నారు. కమ్ టుగెదర్ – లెర్న్ టుగెదర్ – వర్క్ టుగెదర్ – గ్రో టుగెదర్ అనే నినాదంతో ఈ మహా సదస్సు విజయవంతం కావడానికి సర్వం సిద్ధం చేశారు.
