అమెరికాలోని కాలిఫోర్నియా వేదికగా అక్టోబర్ 2026 నెలలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘కర్ణాటిక్ సంగీత కచేరీలు'(Carnatic Concerts) నిర్వహించనున్నారు. నవరాత్రి మ్యూజిక్ సెలబ్రేషన్స్‌లో భాగంగా వివిధ ప్రాంతాలలో ఈ శాస్త్రీయ సంగీత కచేరీలు కొనసాగనున్నాయి. ఈ వేడుకలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, వివరాలు ఇవే…
సంగీత కచేరీల షెడ్యూల్…
అక్టోబర్ 3 (IFAASD స్పాట్లైట్ సిరీస్): అక్టోబర్ 3వ తేదీన సాయంత్రం 4:30 గంటలకు ఎన్సినీటాస్(Encinitas, CA 92024, 1613 Lake Dr) లో ఈ సంగీత కచేరీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వయొలిన్ విద్వాంసులుగా ప్రహ్లాద్ శరవణప్రియన్, మృదంగ విద్వాంసులుగా నవీన్ బసవన్హళ్లి వ్యవహరించనున్నారు.
అక్టోబర్ 11 (నవరాత్రి గృహ సంగీతం): అక్టోబర్ 11వ తేదీన సాయంత్రం 4:00 గంటలకు శాన్ డియేగో (San Diego, CA, 15083 Verdot Court) లో ‘నవరాత్రి గృహసంగీతం’ కార్యక్రమం జరగనుంది. ఇందులో ప్రహ్లాద్ శరవణప్రియన్(వయొలిన్), రామ్‌కుమార్ బాలమూర్తి (మృదంగం) తమ ప్రతిభను ప్రదర్శించనున్నారు.
అక్టోబర్ 13 (శివకామేశ్వరి ఆలయ నవరాత్రి వేడుకలు): అక్టోబర్ 13వ తేదీన సాయంత్రం 6:00 గంటలకు కోస్టా మేసా(Costa Mesa, CA 92626, J, Airport Loop Dr)లోని శివకామేశ్వరి ఆలయంలో నవరాత్రి సంబరాలు జరుగనున్నాయి. ఈ సంగీత వేడుకలో ప్రహ్లాద్ శరవణప్రియన్ వయొలిన్ వాయించనుండగా, శ్రీవత్సన్ శ్రీనివాసన్… మృదంగ సహకారం అందించనున్నారు.
సంప్రదాయ సంగీత ప్రియులను అలరించేందుకు ఏర్పాటు చేసిన ఈ నవరాత్రి సంగీత వేడుకలు అమెరికాలోని ప్రవాస భారతీయ సంగీత అభిమానులను ఎంతగానో ఆకట్టుకోనున్నాయి.
