బే ఏరియాలో సంగీత ప్రియులను ఉర్రూతలూగించేందుకు ‘బిగ్ బాస్కీ ఈవెంట్’, ‘మచా స్వాగ్ డ్యాన్స్’ యుక్తంగా ‘అన్లిమిటెడ్ ఆరా’ (Unlimited Aura) మ్యూజిక్ కాన్సర్ట్‌ను అత్యంత వైభవంగా నిర్వహించబోతున్నాయి. దక్షిణ భారతీయ సంగీత సౌందర్యాన్ని, అంతులేని శక్తిని రంగరించి రూపొందించిన ఈ సంగీత వేడుక ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచనుంది.
కార్యక్రమ వేదిక…
ఈ ప్రతిష్టాత్మక లైవ్ కాన్సర్ట్ వచ్చే అక్టోబర్ 11వ తేదీ, ఆదివారం రోజున సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభం కానుంది. కాలిఫోర్నియాలోని యూనియన్ సిటీలో ఉన్న ప్రఖ్యాత ‘జేమ్స్ లోగన్ హైస్కూల్’ (James Logan High School, 1800 H St, Union City, CA 94587) ఈ సంగీత వేడుకకు వేదికగా నిలవనుంది. సంగీత అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ ప్రదర్శనను తిలకించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా సివాంగి, మానసి, ‘ది అన్టైటిల్డ్ బ్యాండ్’
ఈ మ్యూజికల్ నైట్‌లో ప్రముఖ గాయికలు సివాంగి , మానసి తమ మధురమైన గాత్రంతో ప్రేక్షకులను అలరించనున్నారు. శాస్త్రీయ సంగీతంలో బలమైన పునాది కలిగి, విజయ్ టీవీ ‘సూపర్ సింగర్’ ద్వారా విశేష ఆదరణ పొందిన వీరిద్దరూ. ‘ది అన్టైటిల్డ్ బ్యాండ్'(The Untitled Band – TUB)తో కలిసి ఈ వేదికపై అడుగుపెట్టనున్నారు. వైవిధ్యమైన గాత్ర శైలితో సాగే ఈ ఫ్యూజన్ ఎక్స్ట్రావెగాంజా షో సంగీత ప్రియులను పూర్తిగా మంత్రముగ్ధులను చేయనుంది.
వైరల్ హిట్స్, డ్యాన్స్ విన్యాసాలు
కేవలం పాటలతోనే కాకుండా, సోషల్ మీడియాలో వైరల్ అయిన హిట్స్, ప్రేక్షకులను కుర్చీలలో కూర్చోనివ్వకుండా కాలు కదిలేలా చేసే అద్భుతమైన ఊపు ఈ ఈవెంట్ ప్రధాన హైలైట్‌గా నిలవనుంది. సౌత్ ఇండియన్ మ్యూజిక్ లవర్స్ అందరూ తప్పక అనుభవించాల్సిన ఈ అద్భుతమైన లైవ్ కచేరీకి సంబంధించిన వివరాలను ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చని నిర్వాహకులు వెల్లడించారు.
