అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న శాన్ డియాగోలోని యూసీ శాన్ డియాగో(UC San Diego) వేదికగా అమెరికా ఆధారిత లాభాపేక్ష లేని సంస్థ టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్(TAL) ఆధ్వర్యంలో టాల్హెల్త్ ఫెస్ట్ 2026(TALHealth Fest 2026) కార్యక్రమాన్ని అక్టోబర్ 30, 2026న అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు. ఆరోగ్య సంరక్షణ రంగంలోని నిపుణులు, ఆసుపత్రులు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, టెక్నాలజీ లీడర్లు, ఫార్మాస్యూటికల్ , మెడికల్ కంపెనీలు, పేషెంట్ అడ్వొకేసీ గ్రూపులు, నాన్ఫ్రాఫిట్ సంస్థలు, హెల్త్‌కేర్ సొల్యూషన్ ప్రొవైడర్లను ఈ వేదిక ఒకచోట చేర్చనుంది. హెల్త్‌కేర్ రంగంలో నూతన ఆలోచనలను పంచుకోవడానికి, సహకార అవకాశాలను అన్వేషించడానికి ఈ వేడుక ఎంతగానో దోహదపడుతుంది.
ఆహ్వానించిన వారిలో…
టాల్హెల్త్ ఫెస్ట్ 2026లో భాగంగా, టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి శ్రీ దామోదర రాజనర్సింహ గారిని విశిష్ట అతిథిగా (Distinguished Guest of Honour) ఈ వేడుకకు ఆహ్వానించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ ఐటీ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారిని కూడా విశిష్ట అతిథిగా ఫౌండేషన్ ఆహ్వానించింది.
హెల్త్‌కేర్ యాక్సెస్, ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌గా తెలంగాణ
తెలంగాణలో అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణతో పాటు హెల్త్‌కేర్ ఇన్నోవేషన్‌పై తన దృష్టిని మరింత బలోపేతం చేస్తున్న తరుణంలో ఈ ఆహ్వానాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. లైఫ్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్ టెక్నాలజీ, హెల్త్‌కేర్ ఇన్నోవేషన్ రంగాలకు అంతర్జాతీయ కేంద్రంగా తెలంగాణ తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటోంది. 2026 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం నెక్స్ట్-జెన్ లైఫ్ సైన్సెస్ పాలసీ 2026–30(Next-Gen Life Sciences Policy 2026–30)ను ఆవిష్కరించింది. అడ్వాన్స్డ్ బయోమాన్యుఫ్యాక్చరింగ్, బయాలజిక్స్, ప్రిసిషన్ మెడిసిన్, పర్సనలైజ్డ్ థెరపీస్, డిజిటల్ హెల్త్, డయాగ్నోస్టిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, క్లినికల్ రీసెర్చ్, గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్లు ఈ పాలసీలో వ్యూహాత్మకంగా ఉన్నాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోడ్పటుతో…
కృత్రిమ మేధస్సు (AI) రంగంపై కూడా రాష్ట్రం తన దృష్టిని విస్తరిస్తోంది. ఏఐ స్వీకరణకు ఆరోగ్య సంరక్షణను ప్రాధాన్యతా రంగాలలో ఒకటిగా తెలంగాణ ఏఐ వ్యూహం గుర్తిస్తుంది. పరిశోధన, పెట్టుబడులు, ఆవిష్కరణలకు మద్దతుగా తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్(Telangana AI Innovation Hub) ప్రణాళికలను ప్రభుత్వం ప్రకటించింది. ఇటీవల హెల్త్‌కేర్ డయాగ్నోస్టిక్స్ వంటి రంగాలలో ఏఐ అప్లికేషన్లను కూడా అన్వేషించడం జరిగింది. పబ్లిక్ హెల్త్‌కేర్, టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల కలయిక టాల్హెల్త్ ఫెస్ట్ కోరుకునే చర్చలతో సరిపోలుతుంది.
ఆరోగ్య సంరక్షణ భవితపై ప్రపంచ స్థాయి చర్చ
టాల్హెల్త్ ఫెస్ట్ 2026లో ఏఐ, పర్సనలైజ్డ్ మెడిసిన్, డిజిటల్ హెల్త్‌కేర్ ఇన్నోవేషన్స్, ఇంటిగ్రేటెడ్ అండ్ హోలిస్టిక్ కేర్, మెరుగైన హెల్త్‌కేర్ యాక్సెస్ కోసం గ్లోబల్ ఆప్షన్స్ వంటి కీలక అంశాలను ఈ వేదికపై అన్వేషించనున్నారు. హెల్త్‌కేర్ లీడర్లు, పాలసీ మేకర్లు, పరిశోధకులు, ఆవిష్కర్తలు, నాన్ఫ్రాఫిట్లు, పరిశ్రమ నిపుణుల మధ్య జరిగే చర్చల ద్వారా ఆరోగ్య సంరక్షణను మరింత అందుబాటులోకి తీసుకురావడానికి, నూతనంగా తీర్చిదిద్దడానికి, ప్రజల కేంద్రంగా మార్చడానికి కావలసిన సహకారాలను ప్రోత్సహించాలని టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్ లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ డెలివరీ, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ , ఇన్నోవేషన్ రంగాలలో తెలంగాణ సాధిస్తున్న పురోగతిని దృష్టిలో ఉంచుకుంటే, ఇక్కడి నాయకుల భాగస్వామ్యం ప్రపంచ స్థాయి చర్చకు మరింత ప్రాముఖ్యతను చేకూరుస్తుంది.
