కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డిగోలోని ప్రఖ్యాత హనుమాన్ ఆలయ ప్రాంగణంలో వల్లేం వారి ఫార్మ్స్(Vallem Vaari Farms – VVF AgTech) ఆధ్వర్యంలో అలంకరణ, పండ్ల మొక్కల విక్రయ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రవాస భారతీయలకు తమ ఇంటి వద్దే స్వదేశీ మొక్కల అనుభూతిని అందించేందుకు ఈ ప్రత్యేక విక్రయాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.
వివరాలు…
ఈ మొక్కల విక్రయ కార్యక్రమం అక్టోబర్ 10, 2026 శనివారం రోజున ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 2:00 గంటల వరకు జరగనుంది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డిగోలో ఉన్న హనుమాన్ టెంపుల్ ఈ వేడుకకు ప్రధాన వేదికగా నిలిచింది.
ఆలయ చిరునామా: 9265 Activity Rd #110, San Diego, CA 92126.
లభించే మొక్కలు…
4 అంగుళాల మొక్కలు: తులసి ($15), గోరింటాకు / హెన్నా ($20), 4 ఓ క్లాక్ ($20), రెడ్ హిబిస్కస్ ($20), పారిజాతం ($25), బెల్ ఆఫ్ ఇండియా జాస్మిన్ ($25), డొంతమల్లి ($25), గ్రాండ్ డ్యూక్ జాస్మిన్ ($25), గ్రాండిఫ్లోరమ్ / పోయెట్ జాస్మిన్ ($25), ఇండియన్ జూయి / విరజాజి ($25), తమలపాకులు / బెటెల్ లీఫ్ ($25), పన్నీర్ రోజ్ ($25), టిండోరా ($25), అజోర్స్ జాస్మిన్ / సన్నజాజి ($25), మొరింగా ($30) ధరలలో లభిస్తాయి.
6 అంగుళాల / 1 గాలన్ మొక్కలు: క్రాస్సంద్ర / కనకాంబరం ($30), తులసి ($30), పిన్‌వీల్ / నందివర్ధనం ($35), గ్రాండ్ డ్యూక్ ($35), వేప / నీమ్ ($45), కేజరి / జమ్మి ($45), పారిజాతం ($45), స్మాల్ జుజుబీ ($50) అందుబాటులో ఉన్నాయి.
10 అంగుళాల / 3 గాలన్ మొక్కలు: క్రాస్సంద్ర / కనకాంబరం ($40), పిన్‌వీల్ / నందివర్ధనం ($45) లభిస్తాయి.
పెద్ద పండ్ల మొక్కలు: స్టార్ గూస్బెర్రీ ($100), థాయ్ జామ ($100), చెరిమోయ రెడ్ / రెడ్ సీతాఫల్ ($100), సీతాఫల్ / షుగర్ ఆపిల్ ($150), థాయ్ జుజుబీ ($150), సపోట / చికూ ($150) ధరలలో విక్రయించనున్నారు.
చెల్లింపు విధానం…
ఈ విక్రయ కేంద్రంలో కేవలం కాంటాక్ట్‌లెస్ డిజిటల్ చెల్లింపులు మాత్రమే స్వీకరిస్తారు. ఈ కార్యక్రమం గురించి మరింత సమాచారం కోసం వాట్సాప్ ద్వారా శశికాంత్‌ని +1 (848)-244-0213 సంప్రదించవచ్చు. మొక్కల పట్ల ఆసక్తి ఉన్న స్థానిక ప్రవాస భారతీయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.
