కాలిఫోర్నియాలో ఉన్న శాన్ డియాగో హనుమాన్ ఆలయం (శ్రీ భక్త ఆంజనేయ టెంపుల్), వేద గీత ఫౌండేషన్ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి మహోత్సవం 2026 వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 20 వరకు ఈ వేడుకలు కన్నులపండువగా జరగనున్నాయి. భక్తులందరూ ఈ నవరాత్రి వేడుకల్లో పాల్గొని అమ్మవారి విశేష కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమాల వివరాలు…
అక్టోబర్ 11 (ఆదివారం): ఉదయం 10:30 గంటలకు కలశ స్థాపన, అలాగే దుర్గ, లక్ష్మి, సరస్వతి ఆవాహన & పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతిరోజూ సాయంత్రం 6:30 గంటలకు లలితా సహస్రనామ పారాయణం కూడా ఉంటుందని తెలిపారు.
అక్టోబర్ 17 (శనివారం): సాయంత్రం 4:00 గంటలకు చండీ హోమం(Chandi Homa) అత్యంత వైభవంగా జరగనుంది.
అక్టోబర్ 18 (ఆదివారం): సాయంత్రం 5:00 గంటలకు దుర్గా హోమం నిర్వహించనున్నారు. దుర్గా హోమం అనంతరం దుర్గాష్టమి సందర్భంగా కన్యా పూజ జరగనుంది.
అక్టోబర్ 20 (మంగళవారం): సాయంత్రం 6:00 గంటలకు విజయ దశమి పూజ , వేంకటేశ్వర స్వామి పూజతో ఈ నవరాత్రి వేడుకలు ముగియనున్నాయి.
ఈ వేడుకల్లో భక్తులు వివిధ సేవల రూపంలో స్పాన్సర్షిప్ అందించేందుకు అవకాశం కల్పించారు:
అన్ని ఈవెంట్లకు కలిపి: $501
చండీ హోమం: $101
దుర్గా హోమం: $101
విద్యారంభం: $51
కన్యా పూజ: $51
చెల్లింపుల కోసం Venmo, PayPal సేవలను ఉపయోగించవచ్చు. ఈ వేడుకలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చు:
శాస్త్రిజీ: 858-335-4352
రఘువీర్: 858-252-5751
రాజా: 713-376-5235
సుందర్: 919-961-5747
అధికారిక వెబ్సైట్: www.sbatsd.org
