కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రీమాంట్లోని ప్రఖ్యాత ఫ్రీమాంట్ హిందూ ఆలయం (Fremont Hindu Temple) ఆధ్వర్యంలో ‘దేవిపక్ష, దుర్గా పూజ వేడుకలు 2026′(Devipaksha and Durga Puja Celebration 2026) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. నాన్-ప్రాఫిట్, పన్ను మినహాయింపు సంస్థ అయిన ఈ ఆలయంలో అక్టోబర్ నెలలో ఈ వేడుకలు కన్నులపండువగా జరగనున్నాయి. భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు.
ఈవెంట్ షెడ్యూల్…
అక్టోబర్ 10 (శనివారం): ఉదయం 9:00 నుండి 10:00 గంటల వరకు లేక్ డేల్ వేల్ (Lake Dale Vale) వద్ద ‘పితృ తర్పణ’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
అక్టోబర్ 16 (శుక్రవారం – షష్ఠి): సాయంత్రం 6:00 నుండి 7:30 గంటల వరకు బోధన, అధివాస, ఆగమోని పాటలు ఉంటాయి. రాత్రి 7:30 నుండి 7:45 గంటల వరకు హారతి, 7:00 నుండి 9:00 గంటల వరకు ప్రీతిభోజ్, రాత్రి 8:00 నుండి 9:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి.
అక్టోబర్ 17 (శనివారం – సప్తమి): ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మహాస్నాన, ప్రాణ-ప్రతిష్ఠ, పూజ కార్యక్రమాలు ఉంటాయి. మధ్యాహ్నం 1:00 నుండి 2:00 గంటల వరకు పుష్పాంజలి, 1:00 నుండి 2:30 గంటల వరకు ప్రీతిభోజ్, సాయంత్రం 7:30 గంటలకు హారతి, తిరిగి 7:30 నుండి 9:00 గంటల వరకు ప్రీతిభోజ్, రాత్రి 8:00 నుండి 9:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
అక్టోబర్ 18 (ఆదివారం – మహా అష్టమి): ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు మహాస్నాన, పూజ; మధ్యాహ్నం 1:00 నుండి 2:30 గంటల వరకు పుష్పాంజలి; 1:00 నుండి 3:00 గంటల వరకు ప్రీతిభోజ్ ఉంటాయి. సాయంత్రం 6:30 నుండి 8:30 గంటల వరకు కుమారిపూజ, సంధి పూజ, హారతి (నటరాజ్ డ్యాన్స్ స్కూల్ కుమారీలు చేసే భక్తి నృత్యంతో సహా) జరగనున్నాయి. రాత్రి 8:30 నుండి 9:00 గంటల వరకు పుష్పాంజలి, సాయంత్రం 7:30 నుండి రాత్రి 9:30 గంటల వరకు ప్రీతిభోజ్ ఉంటాయి.
అక్టోబర్ 19 (సోమవారం – నవమి): సాయంత్రం 6:00 నుండి 8:30 గంటల వరకు హోమం, బలిదాన్ (గుమ్మడికాయ), హారతి, ధునుచి నాచ్ ఉంటాయి. రాత్రి 8:40 నుండి 9:00 గంటల వరకు పుష్పాంజలి , సాయంత్రం 7:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు ప్రీతిభోజ్ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 20 (మంగళవారం – విజయ దశమి): సాయంత్రం 5:30 నుండి 6:30 గంటల వరకు పూజ, 6:30 నుండి 7:00 గంటల వరకు పుష్పాంజలి ఉంటాయి. రాత్రి 7:00 నుండి 8:30 గంటల వరకు సిందూర్ ఖేలా(సిందూర్ వేడుక), 8:30 నుండి 9:00 గంటల వరకు అపరాజిత పూజ, విసర్జన , సాయంత్రం 7:30 నుండి రాత్రి 9:00 గంటల వరకు ప్రీతిభోజ్ జరగనున్నాయి.
సంప్రదించాల్సిన వివరాలు…
ఈ వేడుకల్లో భక్తులు $51, $101, $201, $501 రూపాయల రూపంలో స్పాన్సర్షిప్ అందించే అవకాశం కల్పించారు. ఈ ఉత్సవాలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం లేదా స్పాన్సర్షిప్ కోసం నిర్వాహకులను సంప్రదించవచ్చు:
ఆలయ అడ్మిన్: 510-659-0655
జయంత పాండా: 440-227-5498
అధికారిక వెబ్సైట్: www.fremonttemple.org
వేదిక చిరునామా: 3676, డెలావేర్ డ్రైవ్, ఫ్రీమాంట్, CA 94538.
