బే ఏరియాలో అత్యంత వైభవంగా జరిగే అతిపెద్ద పండుగ వేడుకల్లో ఒకనైన దసరా దీపావళి ధమాకా(Dussehra Diwali Dhamaka) కార్యక్రమాన్ని అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్(AIA), బాలీ 92.3 ఎఫ్ఎం(Bolly 92.3 FM) సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా ప్రత్యేక ఆకర్షణగా హనుమాన్ చాలీసా సహస్ర పాఠ్(Hanuman Chalisa Sahasra Paath) కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు ప్రకటించారు. భక్తులందరూ భారీ సంఖ్యలో పాల్గొని ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని కోరారు.
వివరాలు…
ఈ పండుగ వేడుకలు అక్టోబర్ 17, 2026వ తేదీన మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు కొనసాగనున్నాయి. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ప్లెజంటన్లోని Alameda County Fairgrounds, Pleasanton, CA ఈ వేడుకకు ప్రధాన వేదికగా నిలిచింది. ముఖ్యంగా హనుమాన్ చాలీసా సహస్ర పాఠ్ సామూహిక పఠనం అదే రోజు సాయంత్రం సరిగ్గా 5:00 గంటలకు ప్రారంభం కానుంది.
రిజిస్ట్రేషన్, ప్రవేశ టికెట్ల వివరాలు..
హనుమాన్ చాలీసా సహస్ర పాఠ్‌లో పాల్గొనదలుచుకున్న క్రీడాకారులు , భక్తులు https://forms.gle/UKvMf6Rsex27bKLn8 లింక్ ద్వారా ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని నిర్వాహకులు సూచించారు. అయితే, ఈ రిజిస్ట్రేషన్‌లో ఈవెంట్ ప్రవేశ అనుమతి ఉండదని, పాల్గొనేవారు తప్పనిసరిగా https://www.aiaevents.org వెబ్సైట్ ద్వారా ఈవెంట్ ఎంట్రీ టికెట్లు కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.

ప్రధాన ఆకర్షణలు…
10 అడుగుల ఎత్తైన దుర్గాదేవి విగ్రహం
డిస్కో డాండియా (Disco Dandiya)
40 అడుగుల ఎత్తైన రావణ దహనం (Raavan Dahan)
కన్నులపండువగా ఆకట్టుకునే బాణసంచా కాల్పులు
రథయాత్ర , సిందూర్ ఖేలా
మహా మంగళ హారతి
25 ఫుడ్ బూత్‌లు, 150 వెండర్ బూత్‌లతో ఫెస్టివల్ షాపింగ్
కార్నివాల్ రైడ్స్, చెస్ & క్యారమ్స్ పోటీలు
ఏఐఏ ఐడల్(AIA Idol) సింగింగ్, బాలీ సింగ్ అలాంగ్ , తంబోలా
ఉచిత ఆరోగ్య శిబిరం
కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి ఈ వేడుకలకు తరలివచ్చి సంస్కృతి, వినోదం, రుచికరమైన వంటకాలతో కూడిన ఈ పండుగను ఆస్వాదించాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. మరిన్ని వివరాల కోసం aiaevents.org వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు లేదా (408) 490-0220, (510) 421-3535, (408) 499-6530 నంబర్లను సంప్రదించవచ్చు.
