స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించడానికి, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడానికి, విజయాలను వేడుకగా జరుపుకోవడానికి ఫ్రీమాంట్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Fremont Chamber of Commerce) ఆధ్వర్యంలో ఈ వారం నిర్వహించనున్న వివిధ కార్యక్రమాల పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేశారు. స్థానిక కమ్యూనిటీ సభ్యులు, వ్యాపారవేత్తలు పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
కార్యక్రమాల వివరాలు:
మంగళవారం, అక్టోబర్ 6 (సాయంత్రం 6:00 – 8:00 PM): ‘ఇన్నోవేట్ బే’ వేదికగా రోహన్ బ్రౌన్, డోనోవన్ లజారో, రూడీ కాస్టిల్లోల ఆధ్వర్యంలో ‘మేడ్ ఇన్ ఫ్రీమాంట్: ఎమ్ఎఫ్జి వీక్ సెలబ్రేషన్’ కార్యక్రమం జరగనుంది.
బుధవారం, అక్టోబర్ 7 (మధ్యాహ్నం 12:00 – 1:00 PM): 43600 మిషన్ బ్ల్వడ్, ఫ్రీమాంట్‌లోని బిల్డింగ్ 19, రూమ్ 105 వేదికగా ఫ్రీమాంట్ కనెక్షన్ క్లబ్ సమావేశం నిర్వహించనున్నారు.
బుధవారం, అక్టోబర్ 7 (సాయంత్రం 5:00 – 7:00 PM): 6680 రీజినల్ రోడ్, డబ్లిన్ వేదికగా వహాబ్ , హెర్నాండెజ్ల మధ్య ‘కాంగ్రెషనల్ డిబేట్’ జరగనుంది.
గురువారం, అక్టోబర్ 8 (మధ్యాహ్నం 12:00 – 1:00 PM): 45976 వార్మ్ స్ప్రింగ్స్ బ్ల్వడ్, ఫ్రీమాంట్ వేదికగా ఈస్ట్ బే స్కోర్‌కి చెందిన నయీమ్ మాలిక్ ఆధ్వర్యంలో ‘కనెక్ట్ 2 సక్సెస్’ కార్యక్రమం ఉంటుంది.
గురువారం, అక్టోబర్ 8 (సాయంత్రం 5:30 – 7:30 PM): 4074 ఎగ్గర్స్ డ్రైవ్, ఫ్రీమాంట్ లోని ‘మ్యాథ్ సైన్స్ న్యూక్లియస్’ వద్ద ప్రత్యేక మిక్సర్ కార్యక్రమం నిర్వహించనున్నారు.
శుక్రవారం, అక్టోబర్ 9 (ఉదయం 11:30 – మధ్యాహ్నం 12:30 PM): 37140 ఫ్రీమాంట్ బ్ల్వడ్, ఫ్రీమాంట్ వద్ద ‘ప్యూర్ గ్రీన్ జ్యూస్ బార్’ ప్రారంభోత్సవం , రిబ్బన్ కటింగ్ కార్యక్రమం జరగనుంది.
శుక్రవారం, అక్టోబర్ 9 (సాయంత్రం 5:00 – 9:00 PM): 3500 క్యాపిటల్ అవెన్యూ, ఫ్రీమాంట్ వేదికగా ఫ్రీమాంట్ స్ట్రీట్ ఈట్స్(హాట్ చాక్లెట్, పంప్కిన్ స్పైస్ వంటి వాటితో) నిర్వహించనున్నారు.
శుక్రవారం, అక్టోబర్ 9 (సాయంత్రం 6:00 – రాత్రి 10:00 PM): 11600 షానన్ అవెన్యూ, డబ్లిన్ వేదికగా హైవ్లీ 50వ వార్షికోత్సవ వేడుక వైభవంగా జరగనుంది.
శనివారం, అక్టోబర్ 10 (ఉదయం 11:30 – మధ్యాహ్నం 2:30 PM): 8116 మిల్ క్రీక్ రోడ్, ఫ్రీమాంట్ లోని ‘మిషన్ పీక్ వైనరీ’ వద్ద 5 వేర్వేరు ఛాంబర్లతో కలిసి ‘మల్టీ ఛాంబర్ మిక్సర్’ కార్యక్రమం నిర్వహించనున్నారు.
స్థానిక వ్యాపారులు తమ బిజినెస్ కార్డ్‌లతో హాజరై, ఫ్రీమాంట్ కమ్యూనిటీతో కనెక్ట్ కావాలని నిర్వాహకులు కోరారు. మరిన్ని వివరాల కోసం freemontbusiness.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
