కాలిఫోర్నియా రాష్ట్రం పావేలోని శాన్ డియాగో శివ విష్ణు ఆలయం(Shiva Vishnu Temple of San Diego / Vedic Cultural & Spiritual Center) ఆధ్వర్యంలో శరద్ నవరాత్రి , బొమ్మల కొలువు వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. అక్టోబర్ 11 నుండి అక్టోబర్ 19, 2026 వరకు ప్రతిరోజూ సాయంత్రం ఈ వేడుకలు కన్నులపండువగా జరగనున్నాయి.
రోజూ జరిగే కార్యక్రమ వివరాలు…
సమయం 6:30 PM: మా దుర్గ పూజ, శ్రీ చక్ర ఆరాధన , లలితా సహస్రనామ పారాయణం.
సమయం 7:15 PM నుండి 7:45 PM వరకు: సంగీత , నాట్య సేవ, దీనిని అనుసరించి మహా హారతి, ప్రసాద వినియోగం ఉంటుంది.
భక్తులకు విజ్ఞప్తి…
ఈ పవిత్ర వేడుకలకు విచ్చేసే భక్తులు నైవేద్య ప్రసాదం, పూలు , పండ్లను తమ వెంట తీసుకురావాల్సిందిగా ఆలయ నిర్వాహకులు కోరారు.
స్పాన్సర్షిప్ వివరాలు:
ఏదైనా ఒక్క రోజుకు: $51
తొమ్మిది రోజులకు కలిపి: $251
వేదిక: శాన్ డియాగో శివ విష్ణు టెంపుల్, వేదిక్ కల్చరల్ & స్పిరిచ్యువల్ సెంటర్, 16315 పోమేరాడో రోడ్, పావే, CA 92064
మరిన్ని వివరాల కోసం సంప్రదించవలసిన నంబర్లు: (858) 668-9730 లేదా (858) 504-4123
