కాలిఫోర్నియా రాష్ట్రం ప్లీసన్టన్లో భారతీయ సంస్కృతీసంప్రదాయాలు, భక్తి, వినోదాన్ని ప్రతిబింబించేలా ‘దసరా దీపావళి ధమాకా 2026’ వేడుకలను నిర్వహించనున్నారు. అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA), బోల్లీ 92.3 ఎఫ్ఎం (Bolly 92.3 FM) సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరగనున్నాయి.
వేడుకల వివరాలు:
తేదీ: అక్టోబర్ 17, 2026 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 12:00 గంటల నుండి రాత్రి 11:00 గంటల వరకు
వేదిక: అలమేడా కౌంటీ ఫెయిర్గ్రౌండ్స్, 2005 వ్యాలీ అవెన్యూ, ప్లీసన్టన్, CA 94566
కార్యక్రమ ప్రత్యేకతలు…
అమెరికాలో జరిగే అతిపెద్ద దసరా , దీపావళి వేడుకలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఈ వేడుకలో పలు ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు.
ఆధ్యాత్మిక , భక్తి కార్యక్రమాలు: హనుమాన్ చాలీసా సహస్ర పాఠ్, 10 అడుగుల దుర్గాదేవి విగ్రహం, సింధూర్ ఖేలా, ధునుచి నాచ్, రథయాత్ర, మహా మంగళ హారతి నిర్వహించనున్నారు.
సాంస్కృతిక ప్రదర్శనలు: రామలీల ప్రదర్శన , కేరళ చెండ మేళం వంటి సంప్రదాయ కళా రూపాలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
సంగీతం, వినోదం: డిస్కో డాండియా, బోల్లీ సింగ్ అలాంగ్, అంతాక్షరి, AIA ఐడల్ సింగింగ్ పోటీలు జరగనున్నాయి.
కుటుంబ వినోదం: వందలాది బహుమతులతో కూడిన ‘మహా ఖోజ్’ ట్రెజర్ హంట్, కార్నివాల్ రైడ్స్, ఆటలు , వివిధ వయసుల వారికీ పోటీలు ఉంటాయి.
షాపింగ్, ఫుడ్: 150కి పైగా షాపింగ్ బూత్లు , 25కి పైగా ఫుడ్ వెండర్లు వివిధ రకాల రుచులు, వస్తువులను అందుబాటులో ఉంచనున్నారు.
కమ్యూనిటీ వెల్నెస్: సౌత్ ఏషియన్ హార్ట్ సెంటర్ సహకారంతో ఉచిత ఆరోగ్య శిబిరం (Free Health Fair) నిర్వహిస్తారు.
చెడుపై మంచి సాధించిన విజయం, కాంతి ప్రసరణకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను అందరూ కలిసికట్టుగా జరుపుకునేలా ఈ వేదికను ఏర్పాటు చేశారు. కుటుంబసమేతంగా తరలివచ్చి ఈ వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరుతున్నారు. ముందస్తు తగ్గింపు టికెట్ల కోసం www.aiaevents.org వెబ్సైట్ను సందర్శించవచ్చు.
