భారతీయ కాన్సులర్ సేవలను ప్రవాస భారతీయుల కమ్యూనిటీకి మరింత చేరువ చేసే ఉద్దేశంతో, లాస్ ఏంజెల్స్‌లోని భారత కాన్సులేట్ జనరల్ (Consulate General of India, Los Angeles) లాస్ వెగాస్‌లో ఒక ప్రత్యేక కాన్సులర్ క్యాంప్(Consular Camp)ను నిర్వహిస్తోంది. వేగాస్ తెలుగు అసోసియేషన్ (Vegas Telugu Association), ఓఎఫ్‌బీజేపీ లాస్ వెగాస్ (OFBJP Las Vegas), సౌత్ ఏషియన్ ఉమెన్స్ అలయన్స్ ఆఫ్ నెవాడా సంస్థల సంయుక్త సహకారంతో ఈ క్యాంప్ జరగనుంది.
తేదీ: శనివారం, అక్టోబర్ 17, 2026
సమయం: ఉదయం 9:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు
వేదిక: నెవాడా పార్ట్నర్స్, 690 డబ్ల్యూ లేక్ మీడ్ బౌలేవార్డ్, నార్త్ లాస్ వెగాస్, ఎన్వీ 89030
అందించే కాన్సులర్ సేవలు…
ఈ ప్రత్యేక క్యాంప్‌లో ప్రధానంగా వీసా సేవలు, ఓసీఐ, పాస్‌పోర్ట్, అటెస్టేషన్, ఇతర సేవలు, దరఖాస్తుదారులకు తగిన మార్గదర్శకత్వం అందిస్తారు.
ముఖ్యమైన సూచనలు…
సరైన సర్వీసును ఎంచుకుని, ప్రభుత్వ అధికారిక ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయాలి.
VFS రిజిస్ట్రేషన్, అపాయింట్మెంట్ బుకింగ్, అవసరమైన ఫీజు చెల్లింపులు ఆన్లైన్లోనే పూర్తి చేయాలి.
ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌లు, VFS చెక్‌లిస్ట్, అవసరమైన అఫిడవిట్ల ప్రింట్ అవుట్స్ తప్పనిసరిగా వెంట తెచ్చుకోవాలి.
అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్లు , వాటి స్పష్టమైన ఫోటోకాపీలను తీసుకురావాలి. అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను స్వీకరించరు.
తీసుకురావాల్సిన పత్రాలు..
వీసా, పాస్‌పోర్ట్ & ఓసీఐ: ప్రింట్ తీసి సంతకం చేసిన అప్లికేషన్ ఫారమ్, ప్రస్తుత పాస్‌పోర్ట్ కాపీలు, ఫోటోలు, అమెరికాలో చట్టబద్ధమైన నివాస/చిరునామా ధృవీకరణ పత్రాలు తీసుకురావాలి. ఓసీఐ దరఖాస్తుదారులు పాత భారతీయ పాస్‌పోర్ట్ రద్దు సర్టిఫికెట్, పేరెంట్/గ్రాండ్పేరెంట్ ఆధారాలు జతచేయాలి.
అటెస్టేషన్ & ఇతర సేవలు: ఏ డాక్యుమెంట్‌ను అటెస్ట్ చేయాలో దాని ఒరిజినల్, ఫోటోకాపీ, అలాగే అవసరమైన చోట నోటరైజేషన్/అపోస్టిల్ (Notarization/apostille) తప్పనిసరిగా తీసుకురావాలి.
సంప్రదించవలసిన వివరాలు:
అపాయింట్మెంట్ బుక్ చేసుకునేందుకు నిర్వాహకులు అందించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేయవచ్చు. క్యాంప్‌కు సంబంధించిన మరింత సమాచారం , సందేహాల కోసం ఈ క్రింది ప్రతినిధులను సంప్రదించవచ్చు:
మోహన్ అచంట: 770-855-8143
అశోక్ గోయల్: 702-683-1386
దివ్య: 775-291-8891
దేవెన్ సింగ్: 702-525-9032
