కాలిఫోర్నియా రశాన్ రామన్ నగరంలో బే ఏరియా తెలుగు అసోసియేషన్ (బాటా) ఆధ్వర్యంలో దీపావళి సంబరాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. నవంబర్ 1వ తేదీ ఆదివారం రోజున మధ్యాహ్నం 3 గంటల నుంచి విండెమేర్ రాంచ్ మిడిల్ స్కూల్ (11611 ఈ బ్రాంచ్ పార్క్ వే, శాన్ రామన్, సీఏ 94582) వేదికగా ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ప్రవాస తెలుగు సమాజంలో ఆనందోత్సాహాలను నింపేందుకు, మన సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకలకు తెలుగు టైమ్స్ అధికారిక మీడియా పార్ట్నర్గా వ్యవహరిస్తుండటం విశేషం.
సమీరా భరద్వాజ్ లైవ్ కన్సర్ట్…
ఈ దీపావళి సంబరాల్లో ప్రధాన ఆకర్షణగా ప్రముఖ టాలీవుడ్ గాయని, యాంకర్, ఇన్ ఫ్లుయెన్సర్ సమీరా భరద్వాజ్ లైవ్ కన్సర్ట్ ఉండనుంది. లైవ్ బ్యాండ్‌తో కలిసి ఆమె పాడే పాటలు ప్రేక్షకులను ఉర్రూతలూగించనున్నాయి. వీటితో పాటు ఆహా తెలుగు ఐడల్ సింగింగ్ కాంపిటీషన్స్ కూడా నిర్వహించనున్నారు. డాన్స్ ధమాకా పేరుతో యువ తారాజువ్వలు, సిసింద్రీ తారలు, ధ్రువ తారలు చేసే అద్భుతమైన నృత్య ప్రదర్శనలు, బాటా బీట్స్ డాన్స్ స్టూడియో వారి ఎలక్ట్రిఫైయింగ్ డ్యాన్స్ మూమెంట్స్ ఈ కార్యక్రమానికి మరింత శోభను తీసుకురానున్నాయి.
పండుగ వాతావరణాన్ని మరింత ఆస్వాదించడానికి వీలుగా షాపింగ్ కోసం ప్రత్యేకంగా దీపావళి బజార్ ను ఏర్పాటు చేశారు. పండుగ ప్రత్యేక వంటకాలను ఆస్వాదించేందుకు దీపావళి రుచుల పందిరి పేరుతో రుచికరమైన ఫుడ్ స్టాల్స్ అందుబాటులో ఉంచారు. ఈ వేడుకలకు విచ్చేసే వారందరికీ ఉచిత పార్కింగ్ సౌకర్యం కల్పించినట్లు నిర్వాహకులు తెలిపారు. టికెట్ల కోసం ఫ్లయర్ పై ఉన్న క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేయవచ్చని సూచించారు.
సాంస్కృతిక కార్యక్రమాల రిజిస్ట్రేషన్ కోసం బాటా వెబ్సైట్ ను సందర్శించవచ్చని, లేదా 510-421-3535 నంబర్‌ను, బాటా ఈమెయిల్ ను సంప్రదించవచ్చని వివరించారు. బూత్‌లు , స్పాన్సర్షిప్ వివరాల కోసం 408-499-6530 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి వచ్చి పండుగను జరుపుకోవాలని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాటా ప్రతినిధులు కోరారు.
