అమెరికాలోని శాక్రామెంటో, పరిసర ప్రాంతాలలో నివసించే తెలుగు ప్రవాసుల కోసం గ్రేటర్ శాక్రామెంటో తెలుగు సంఘం (TAGS), ప్రసిద్ధ ఫ్యాషన్ సంస్థ ‘ట్రెజర్ ట్రంక్’ రెండు ప్రత్యేక వేడుకల వివరాలను వెల్లడించాయి.
1. గ్రేటర్ శాక్రామెంటో తెలుగు సంఘం (TAGS) ‘స్పోర్ట్స్ ఫెస్ట్ 2026’
తెలుగు సమాజంలో క్రీడా స్ఫూర్తిని, ఆరోగ్య అవగాహనను పెంపొందించేందుకు “కలిసి ఆడదాం.. కలసి గెలుద్దాం” (Play Together. Win Together) అనే నినాదంతో గ్రేటర్ శాక్రామెంటో తెలుగు సంఘం (TAGS) ‘స్పోర్ట్స్ ఫెస్ట్ 2026’ ను నిర్వహిస్తోంది. అక్టోబర్ , నవంబర్ నెలల్లో వివిధ రకాల క్రీడా పోటీలు జరగనున్నాయి.
వేదికల వివరాలు…
బ్యాడ్మింటన్ పోటీలు అక్టోబర్ 24, 2026 (శనివారం) రోజు NCBC (2421 Mercantile Dr, Suite D, Rancho Cordova, CA 95742) వేదికగా నిర్వహించనున్నారు.
టేబుల్ టెన్నిస్ , తెన్నికోయిట్ పోటీలు అక్టోబర్ 25, 2026 (ఆదివారం) NCBC (2421 Mercantile Dr, Suite D, Rancho Cordova, CA 95742) వేదికగా నిర్వహించనున్నారు.
చెస్, క్యారమ్స్, పెయింటింగ్ పోటీలు నవంబర్ 14, 2026 (శనివారం) చిన్మయ మిషన్, 3231 రామొస్ సర్కిల్, శాక్రామెంటో, CA 95827
త్రోబాల్ , పికిల్‌బాల్ పోటీలు నవంబర్ 21, 2026 (శనివారం) ఆండీ మోరిన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, 66 క్లార్క్స్‌విల్లే రోడ్, ఫోల్సమ్, CA 95630 నిర్వహించనున్నారు.
రిజిస్ట్రేషన్, ఇతర వివరాలు:
పోటీలలో పాల్గొనాలనుకునే క్రీడాభిమానులు ఆన్లైన్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవచ్చు. పాల్గొనే వారందరూ తమ వెంట వాటర్ బాటిళ్లను తెచ్చుకోవాలని నిర్వాహకులు కోరారు.
ఫోన్ నంబర్: 916-932-TAGS (8247)
ఈమెయిల్: [email protected]
2. ‘ట్రెజర్ ట్రంక్’ దసరా & దివాళి ఎక్స్‌క్లూజివ్ షో..
దసరా, దీపావళి పండుగల పురస్కరించుకుని ఫ్యాషన్, జ్యువెల్రీ ప్రియుల కోసం ‘ట్రెజర్ ట్రంక్’ ప్రత్యేక ఎగ్జిబిషన్ , సేల్ షోను నిర్వహిస్తోంది. పండుగ షాపింగ్‌కు సరికొత్త శోభను ఇచ్చేలా 5 గోల్డ్ , డైమండ్ బ్రాండ్లతో పాటు మొత్తం 20కి పైగా ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులను ఒకే చోట అందుబాటులో ఉంచుతున్నారు.
ఈవెంట్ తేదీలు, వేదిక..
మొదటి రోజు (ప్లెజంటన్) ఈవెంట్ అక్టోబర్ 10, 2026 నాడు ప్లెజంటన్లోని ప్లెజంటన్ మ్యారియాట్, 11950 డబ్లిన్ క్యాన్యన్ రోడ్, ప్లెజంటన్, CA 94588 వేదికగా నిర్వహించనున్నారు.
రెండవ రోజు (శాక్రామెంటో) ఈవెంట్ అక్టోబర్ 11, 2026 నాడు శాక్రమెంటో మ్యారియాట్ రాంచో కోర్డోవా, 11211 పాయింట్ ఈ డ్రైవ్, రాంచో కోర్డోవా, CA 95742 వేదికగా నిర్వహించనున్నారు.
మరిన్ని వివరాలకు +1 918 397 2010 నంబరులో సంప్రదించవచ్చు.
