బే ఏరియాలోని సేవా (Sewa Bay Area) సంస్థ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్లో నూతన కమ్యూనిటీ సెంటర్ను ఘనంగా ప్రారంభించింది. సేవా సంస్థ సామాజిక సేవా ప్రస్థానంలో ఇది ఒక చారిత్రక మైలురాయిగా నిలిచింది.
కొత్త కేంద్రం అడ్రస్ వివరాలు:
చిరునామా: 691 S.Milpitas Boulevard, Suite 100, Milpitas, CA — మిల్పిటాస్ టెక్ సెంటర్ (ఫాల్కన్ఎక్స్ బిల్డింగ్) లోపల.
సేవా కార్యక్రమాల గురించి…
ఈ నూతన కేంద్రం ద్వారా ఆహార భద్రత, విద్య, ఆరోగ్య సమానత్వం, విపత్తు సహాయం వంటి విభాగాలలో సేవా బే ఏరియా చేపడుతున్న కార్యకలాపాలు మరింత బలపడనున్నాయి. తద్వారా బే ఏరియా వ్యాప్తంగా ఉన్న అనేక కుటుంబాలకు, స్థానిక కమ్యూనిటీలకు మెరుగైన రీతిలో సేవనందించడానికి నూతన అవకాశాలు ఏర్పడతాయని నిర్వాహకులు తెలిపారు.
సేవా ఇంటర్నేషనల్ స్ఫూర్తి…
కరుణ, నిస్వార్థ సేవతో మానవాళికి సేవలందించడమే లక్ష్యంగా పనిచేస్తున్న సేవా ఇంటర్నేషనల్ సంస్థలో భాగంగా, ఈ నూతన కేంద్రం మరింత బలమైన సామాజిక సంబంధాలను నిర్మించడంలో తోడ్పడుతుందని భావిస్తున్నారు. ఈ ప్రయాణంలో తమకు అండగా నిలిచిన ప్రతి ఒక్క వాలంటీర్కు, భాగస్వాములకు, కమ్యూనిటీ సభ్యులకు నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. “New space, renewed commitment to serve. Together, we serve better” అనే నినాదంతో ఈ వేడుకను ముగించారు.
