—సూర్య ప్రకాష్ జోశ్యుల
కొన్ని సినిమాలు ..కేవలం సినిమాలుగా ఉండవు. తమ తర్వాత సినిమాలకు మార్గదర్శనం చేస్తాయి. అలాంటి సినిమాల్లో లారెన్స్ కాస్డన్ తెరకెక్కించిన ‘బాడీ హీట్’ (Body Heat – 1981) ఒకటి. ఈ సినిమా కేవలం ఒక హిట్ థ్రిల్లర్ మాత్రమే కాదు. హాలీవుడ్ సినిమా హిస్టరీలో ‘ఎరోటిక్ నియో-నోయిర్’ అనే కొత్త జానర్‌కు ప్రాణం పోసిన అసలైన బెంచ్‌మార్క్ ఫిల్మ్. ఈ సినిమా వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ కొత్త తరం ఫిలిం మేకర్లకు, సినిమా ప్రేమికులకు ఒక క్లాసిక్ టెక్స్ట్‌బుక్‌లా మార్గదర్శనం చేస్తూనే ఉంది.
ఏముంది ఈ సినిమాలో..?
ఒక మగాడు… ఒక వివాహిత మహిళ.. మండు వేసవి… అక్రమ సంబంధం… డబ్బు… ఒక హత్య. ఆ తర్వాత మొదలయ్యే మోసం. ఇవీ ఈ సినిమా దినుసులు. ఇవన్నీ వింటూంటే మనం చూసిన Erotic Thriller సినిమాల్లో ఏదో ఒకటి గుర్తుకు రావచ్చు. కానీ ఈ ఫార్ములా ఈరోజు పుట్టింది కాదు. 1981లోనే Lawrence Kasdan ‘Body Heat’తో దీనికి ఒక కొత్త భాషను ఇచ్చాడు. అందుకే ఈ సినిమాను కేవలం Erotic Thriller అని పిలవడం సరిపోదు. ఆ జానర్‌కు ఒక ముఖ్యమైన పునాది వేసిన సినిమాగా చూడాలి. ఇది సెక్స్‌ను చూపించడానికి తీసిన సినిమా కాదు. సెక్స్‌ను కథలో ఒక ఆయుధంగా మార్చిన సినిమా.
కథ ఏమిటి..
ఈ కథ అంతా మియామీలోని ఊపిరాడని ఉక్కపోత, మండుతున్న వేసవి కాలం నేపథ్యంలో సాగుతుంది. నెడ్ రాసిన్ అనే ఒక సాదాసీదా, కాస్త అహంకారం ఉన్న డిఫెన్స్ లాయర్ జీవితంలోకి మ్యాటీ వాకర్ అనే అందమైన, వివాహిత ఎంట్రీ ఇస్తుంది. మొదటి చూపులోనే నెడ్ ఆమె అందానికి పూర్తిగా దాసోహమవుతాడు. వారి మధ్య మొదలైన ఆకర్షణ త్వరలోనే సరిహద్దులు దాటి ఒక తీవ్రమైన శారీరక బంధంగా మారుతుంది.
అయితే, మ్యాటీ తన భర్తతో పడుతున్న నరకాన్ని వివరించి, అతని ఆస్తిని దక్కించుకోవడానికి భర్తను చంపడమే ఏకైక మార్గమని నెడ్ను నమ్మిస్తుంది. మోహంలో కళ్ళు మూసుకుపోయిన నెడ్, ఆమె చెప్పిన కుట్రకు ఊకొట్టి ఆ హత్యను పక్కాగా అమలు చేస్తాడు. కానీ, అసలు నాటకం ఆ హత్య తర్వాతే మొదలవుతుంది. ప్రేమ పేరుతో తను ఒక పక్కా ప్లాన్ ప్రకారం వల వేసి వేటాడబడ్డానని నెడ్కు అర్థమయ్యేసరికి సమయం మించిపోతుంది.
చీకటిని తోసి రాజేసిన సూర్యకాంతి
సాధారణంగా పాతకాలపు ‘ఫిల్మ్ నోయిర్’ సినిమాలు అనగానే మనకు వర్షం పడే చీకటి రాత్రులు, నియాన్ వెలుగులు, నీడలతో కూడిన సందులు గుర్తుకొస్తాయి. కానీ, కాస్డన్ ఈ సినిమాలో ఆ సాంప్రదాయక శైలిని పూర్తిగా తిరగరాశారు. ‘బాడీ హీట్’ లో భయం చీకటిలో కాకుండా, మిరుమిట్లు గొలిపే ఎండలో నడుస్తుంది.
సినిమాలో పాత్రలు నిరంతరం చెమటతో తడిసిపోవడం, ఫ్యాన్లు తిరగడం, ఐస్ గడ్డలను వాడుకోవడం కేవలం వాతావరణాన్ని చూపించడానికి మాత్రమే కాదు. అది ఆ పాత్రల మనస్సులోని అదుపులేని కోరికకు, పెరుగుతున్న ఆందోళనకు ఒక ఆకర్షణీయమైన ‘విజువల్ మెటాఫర్’. వాతావరణంలో వేడి ఎంతగా పెరుగుతుందో, కథలోని నేర ప్రవృత్తి, ప్రమాదం కూడా అంతే స్థాయికి చేరుకుంటాయి.
కేథలీన్ టర్నర్… ‘ఫెమ్ ఫాతాలే’కి ఒక కొత్త నిర్వచనం
ఈ సినిమాలో మ్యాటీ వాకర్ పాత్ర ద్వారా కేథలీన్ టర్నర్ హాలీవుడ్‌కు ఒక కొత్త తరహా ‘ఫెమ్ ఫాతాలే’ (Femme Fatale)ను పరిచయం చేసింది. పాత సినిమాల్లోని విలక్షణమైన స్త్రీ పాత్రల్లా ఆమె కేవలం అందంతో పురుషుడిని ఆకర్షించి ఊరుకోదు. ఆ ఆకర్షణను అత్యంత సమర్థవంతమైన ఆయుధంగా మార్చుకుని సైకలాజికల్ మానిప్యులేషన్ చేస్తుంది.
నెడ్ ఆమె కోసం తన వృత్తిని, నైతికతను, చివరికి తన జీవితాన్ని కూడా తాకట్టు పెడతాడు. ఇక్కడే సినిమా ప్రేక్షకుడిని ఒక సందేహం వస్తుంది. అసలు నెడ్ నిజంగా మ్యాటీని ప్రేమిస్తున్నాడా, లేక తనలో రగిలిన అదుపులేని కోరికను ప్రేమిస్తున్నాడా? ఈ రెండింటి మధ్య ఉన్న సన్నని గీతే కథను చివరి వరకు సస్పెన్స్‌తో నడిపిస్తుంది.
శృంగారం ఇక్కడ వ్యామోహం కాదు, ఒక పక్కా ఆయుధం
ఈ సినిమాకు మిగతా థ్రిల్లర్ల కు తేడా ఏమిటంటే… ఇందులో సెక్స్ అనేది కేవలం రెండు పాత్రల మధ్య ఉన్న సాన్నిహిత్యం కాదు, అదొక వ్యూహం. ఒక వ్యక్తిని మానసికంగా పూర్తిగా తన అదుపులోకి తెచ్చుకోవడానికి, అతని తెలివితేటలను మసకబారజేయడానికి మ్యాటీ ఆ ఆకర్షణను ఉపయోగించుకుంటుంది. ఇక్కడ ప్రేమికుడు తన భాగస్వామిని చూసి “ఈమె నన్ను కాపాడుతుందా, లేక నాశనం చేస్తుందా?” అనే నిరంతర ఆందోళనలో ఉంటాడు. ఈ ఊగిసలాటే ఎరోటిక్ థ్రిల్లర్ జానర్‌కు అసలైన బలాన్ని, ఉత్కంఠను అందిస్తుంది.
ఏమిటి దీని ప్రత్యేకత
Erotic Thriller జానర్లో Body Heatను ప్రత్యేకంగా నిలబెట్టిన అంశం ఒకటే. ఇక్కడ శారీరక ఆకర్షణకు ఒక ప్రత్యేకమైన ప్రయోజనం ఉంది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై నియంత్రణ సాధించడానికి ఆకర్షణను ఉపయోగించవచ్చు. ఆ క్షణానికి ఒక సంబంధం నిజమైనదిగా కనిపించవచ్చు. అయితే దాని వెనుక డబ్బు ఉండవచ్చు. ప్రతీకారం ఉండవచ్చు. మోసం ఉండవచ్చు. హత్య కూడా ఉండవచ్చు. అంటే Seduction itself becomes suspense. అందుకే ప్రేక్షకుడు “వాళ్లు కలుస్తారా?” అని మాత్రమే ఎదురుచూడడు. “వాళ్లు కలిసిన తర్వాత ఏం జరుగుతుంది?” అని భయపడతాడు. ఇదే ఆ తర్వాత వచ్చజిన Erotic Thriller సినిమాలకు DNAగా మారింది.
ఆధునిక ఎరోటిక్ థ్రిల్లర్లకు బ్లూ ప్రింట్
‘బాడీ హీట్’ అందించిన విజయం తర్వాతే 1980లు, 90ల కాలంలో హాలీవుడ్‌ను ఊపేసిన బేసిక్ ఇన్స్టింక్ట్, ఫేటల్ అట్రాక్షన్, ది లాస్ట్ సెడక్షన్ వంటి ఎన్నో సంచలనాత్మక సినిమాలు వెలుగులోకి వచ్చాయి. “మోహం మనిషి విచక్షణాజ్ఞానాన్ని, ఆలోచనా శక్తిని ఎలా మభ్యపెట్టగలదో థ్రిల్లర్ ఫార్మాట్లో చూపించడమే ఈ సినిమా సాధించిన గొప్ప విజయం.”
నెడ్ చట్టాలను క్షుణ్ణంగా చదివిన తెలివైన లాయిరే కావచ్చు, కానీ కోరిక అనేది మనిషి ఆలోచనలను ఎలా మార్చేస్తుందో అతడు అంచనా వేయలేకపోతాడు.
AI యుగంలోనూ ఎందుకు నచ్చుతోంది?
Body Heatలో ఒక వ్యక్తి మరొకరి కోరికలు, బలహీనతలను అర్థం చేసుకుని అతన్ని manipulate చేస్తాడు. AI యుగంలో అదే concept మరో స్థాయికి వెళ్లింది. Algorithms మన ఇష్టాలు తెలుసుకుంటాయి. ఏం చూడాలో సూచిస్తాయి. ఏం కొనాలో ప్రభావితం చేస్తాయి. మన attentionను పట్టుకోవడానికి మన behaviorను analyze చేస్తాయి.
అలాగే Body Heatలోని “ఎవరు ఎవరిని control చేస్తున్నారు?” అనే ప్రశ్న ఇప్పుడు కేవలం ప్రేమ సంబంధానికి సంబంధించినది కాదు. Dating apps, social media, AI companions, personalized chatbots—ఇవన్నీ మనం ఎవరితో connect అవుతున్నామో, ఎలా connect అవుతున్నామో మార్చుతున్నాయి.
అందుకే 1981లో తీసిన ఈ సినిమా 2026లో కూడా కొత్తగా అనిపించవచ్చు. Technology మారిపోయింది. Human weakness మాత్రం update కాలేదు.
ఇది AI యుగంలో Body Heatను మనకి నచ్చటానికి బలమైన కారణం.
