దశాబ్దాలుగా ఎంతోమంది కొత్త యాంకర్లు వస్తున్నప్పటికీ, తనదైన శైలిలో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంటూ అగ్రస్థానంలో కొనసాగుతున్నారు ప్రముఖ యాంకర్ సుమ. ఆమెకున్న సహజమైన హాస్యం, అద్భుతమైన టైమింగ్, ఏమాత్రం వయసు కనబడని లుక్స్ , స్టేజ్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు.
ఇటీవల అమెరికాలో జరిగిన ఒక ఈవెంట్‌కు హోస్ట్‌గా వ్యవహరించిన సుమ, ఆ ఒక్క రాత్రి కార్యక్రమానికి గాను దాదాపు 10,000 డాలర్లు రెమ్యునరేషన్‌గా అందుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో జరిగే ఆడియో ఈవెంట్లతో పోలిస్తే అమెరికాలో ఈ ఈవెంట్ కోసం ఆమె తీసుకున్న ఈ మొత్తం సహేతుకమైనదే అని కొందరు అంటున్నారు. ఇక జూలై మధ్యలో షార్లెట్‌లో జరిగిన మూడు రోజుల టీటీఏ కన్వెన్షన్‌కు ఆమె ఎంత తీసుకుని ఉంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ వేడుకకు సుమ సుమారు 70,000 డాలర్లు పారితోషికం అందుకున్నారని టాక్.
అలాగే డల్లాస్‌లోనూ మరో షోను నిర్వహించిన ఆమె, అమెరికాలో మరికొన్ని రోజులు ఉండి మరిన్ని ఈవెంట్స్ చేస్తే మరింత భారీ మొత్తాన్ని ఆర్జించే అవకాశం ఉంది. కేవలం స్టేజ్ షోలే కాకుండా, అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో ఆమె చేసిన ఫన్నీ రీల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అన్ని తరాల ప్రేక్షకులతో ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ అయ్యే ఆమె ప్రత్యేకత, ఎంతటి ఎత్తుకు ఎదిగినా అనకువతో ఉండి అందరితో కలిసిపోయే ఆమె నిరాడంబరతనే సుమను మరింత ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి. ఈ అరుదైన ప్రతిభ, వినయమే ఆమెకు మరింత ఆదరణను, అఖండ విజయాలను తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు.
