అగ్ర నటుడు అల్లు అర్జున్ హీరోగా, కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా ‘రాకా’ గురించి టాలీవుడ్లో ఓ క్రేజీ వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటుడు విల్ స్మిత్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం. దీనిపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతుండగా, త్వరలోనే దీనికి సంబంధించిన షూటింగ్ ప్రారంభం కానుందని సినీ వర్గాల టాక్. అంతేకాకుండా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా ఈ చిత్రంలో ఓ క్యామియో రోల్లో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ భారీ చిత్రంలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొణె నటిస్తుండగా, జాన్వీ కపూర్, రష్మిక మందన్న తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. అల్లు అర్జున్, విల్ స్మిత్, షారుఖ్ ఖాన్ ఒకే ప్రాజెక్ట్‌లో భాగమైతే ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరడం ఖాయం. అయితే ఈ వార్తలపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని పలు భాషల్లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించి, 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
