యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఆయన నటిస్తున్న ఓ సరికొత్త భారీ చిత్రానికి ‘ఇంద్రపుత్ర’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ చిత్రబృందం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. మెరుపులు, భారీ కొండలు, విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్న ఈ పోస్టర్‌తో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
శ్రీకాంత్ పుప్పల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, జీ స్టూడియోస్ మరియు ప్రేరణ అరోరా సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు కీర్తన్ కథ అందించగా, తాన్వీ ఎన్. దత్తా రచన చేస్తున్నారు. పురాణ మరియు యాక్షన్ ఫాంటసీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని 2027లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
