మాస్ రాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్లో వస్తున్న తాజా సినిమా ‘ఇరుముడి’. ఈ చిత్రం వచ్చే శుక్రవారం అంటే ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. సరిగ్గా అదే రోజు వరలక్ష్మీ వ్రతం పండగ కూడా వస్తుండటంతో ఈ సినిమా విడుదల తేదీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ పర్టికులర్ డేట్ సినిమా కంటెంట్ ఫ్లేవర్కు చాలా ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
‘ఇరుముడి’ అనే టైటిల్ వినగానే ఇందులో ఒక దైవిక అంశం ఉందనే విషయం స్పష్టమవుతోంది. ప్రమోషనల్ విజువల్స్ చూస్తుంటే సినిమాలో హీరో అయ్యప్ప దీక్ష తీసుకునే ఘట్టం చాలా కీలకంగా ఉండబోతుందని అర్థమవుతోంది. అయితే ఇది కేవలం భక్తి చిత్రమే కాదని, హీరో పాత్రలోదొరుకుతున్న విభిన్న కోణాల్లో ఇదొక లేయర్ మాత్రమేనని దర్శకుడు శివ నిర్వాణ స్పష్టం చేశారు. తండ్రీకూతుళ్ల మధ్య ఉండే బలమైన భావోద్వేగాలు, సామాజిక అంశాలు, మిస్టరీ ఎలిమెంట్స్ ఈ కథలో ప్రధానంగా ఉండనున్నాయి.
ఆగస్టు 21న సినిమా విడుదలవుతుండటం బాక్సాఫీస్ పరంగా పెద్ద అడ్వాంటేజ్ అనే చెప్పాలి. పండగ రోజు కావడంతో పాటు వెంటనే వీకెండ్ కలిసిరావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టే అవకాశం ఉంది. సాధారణంగా రవితేజ సినిమాల్లో మాస్, కామెడీ, హైవోల్టేజ్ యాక్షన్ ఎక్కువగా కనిపిస్తాయి. కానీ ‘ఇరుముడి’ మాత్రం ఆ మాస్ ఇమేజ్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, భక్తి, మిస్టరీ అంశాలను మిక్స్ చేసి వస్తోంది. ఏదేమైనా పండగ రోజు విడుదల కావడం కుటుంబ ప్రేక్షకులకు మంచి అనుభూతిని ఇస్తుందని, సినిమా విజయం పూర్తిగా కంటెంట్ పైనే ఆధారపడి ఉంటుందని సినీ
