మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఇరుముడి’ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు రోజుల్లోనే కళ్లు చెదిరే కలెక్షన్స్‌తో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది.
రెండు రోజుల బాక్సాఫీస్ వసూళ్ల వివరాలు:
ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో ఈ సినిమా రూ. 47.45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు సినీ వర్గాలు వెల్లడించాయి.
ఇండియావ్యాప్తంగా రూ. 36.45 కోట్ల గ్రాస్ వసూలు కాగా, నెట్ కలెక్షన్స్ రూ. 31.40 కోట్లకు చేరాయి.
ఓవర్సీస్ మార్కెట్లోనూ ఈ చిత్రం సత్తా చాటుతూ ఇప్పటివరకూ రూ. 11 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. వీకెండ్ కావడంతో ఈ నెంబర్స్ మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
గత పదేళ్లలో రికార్డు ఫీట్:
కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించేసిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. గత పదేళ్లలో విడుదలైన సినిమాల్లో రెండో రోజే లాభాల బాట పట్టిన రేర్ ఫీట్‌ను ‘ఇరుముడి’ సొంతం చేసుకుందని ట్రేడ్ పండితులు పేర్కొన్నారు.
ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించగా, ఆయన కుమార్తెగా చిన్నారి నక్షత్ర అద్భుతమైన అభినయం ప్రదర్శించింది. అలాగే అజయ్ ఘోష్, సాయి కుమార్ కీలక పాత్రలు పోషించగా, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించగా, చాలా రోజుల తర్వాత రవితేజ ఖాతాలో సరైన బ్లాక్‌బస్టర్ హిట్ పడిందని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
