మాస్ మహారాజ రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’. ఈ చిత్రంలో ప్రియ భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 21న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు.
భక్తి, కుటుంబ భావోద్వేగాలు , యాక్షన్ అంశాల మేళవింపుతో ఈ సినిమాను రూపొందించినట్లు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. కూతురు సెంటిమెంట్ ప్రధాన అస్త్రంగా సినిమాను మలిచినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘ఇరుముడి కట్టు.. శబరిమల ఎక్కు..’ పాటలోని సాంగ్ లిరిక్స్ అందరినీ ఎంతగానో అలరిస్తున్నాయి. ట్రైలర్లో మ్యూజిక్ సైతం సూపర్‌గా ఉంది.
