సినిమాలో స్టార్ హీరో కనిపిస్తే వచ్చే హైప్ వేరు. కానీ ఇప్పుడు స్క్రీన్‌పై కనిపించకుండా, కేవలం గొంతుతోనే సినిమాకు అదనపు ఆకర్షణ తీసుకురావడం టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్‌గా మారుతోంది. ఒకప్పుడు కథను పరిచయం చేయడానికి మాత్రమే పరిమితమైన వాయిస్ ఓవర్లు.. ఇప్పుడు స్టార్ హీరోల ఎంట్రీతో సరికొత్త క్యామియో ఎఫెక్ట్‌ను క్రియేట్ చేస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా విషయంలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ నేరుగా తెరపై కనిపించకపోయినా, ఆయన పవర్ఫుల్ వాయిస్ సినిమాకు స్పెషల్ ఎనర్జీని తీసుకురానుందని భావిస్తున్నారు.
సాధారణంగా గెస్ట్ రోల్స్ లేదా క్యామియోల కోసం స్టార్ హీరోలను ఒప్పించడం, వారి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టంతో కూడుకున్న విషయం. కానీ వాయిస్ ఓవర్ ద్వారా ఆ ఇబ్బందులు లేకుండానే స్టార్స్ క్రేజ్‌ను సినిమాకు ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల క్రాస్-ఫ్యాన్‌బేస్ కూడా కలుస్తుంది. వెంకటేష్ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు కూడా ఆసక్తి చూపడం, సోషల్ మీడియాలో ఈ చర్చ నడవవడం సినిమా ప్రమోషన్లకు ఎంతో ప్లస్ అవుతుంది. భవిష్యత్తులో ఈ తరహా స్టార్ వాయిస్ ఓవర్లు సినిమాలకు బిగ్గెస్ట్ అసెట్‌గా మారే అవకాశం ఉంది.
