స్టార్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి మరోసారి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. బాలనటిగా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంతో ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆమె, ప్రస్తుతం గాయనిగా తన సత్తా చాటుతున్నారు. ఇటీవల సౌత్ కొరియాలో జరిగిన ఒక మ్యూజికల్ కాన్సర్ట్‌లో ప్రధాన గాయనిగా అరంగేట్రం చేసి అదరగొట్టారు.
తాజాగా అమెరికాలోని ప్రసిద్ధ ‘బర్క్లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’ (బోస్టన్)లో సంగీత విభాగంలో జరిగే సమ్మర్ ప్రోగ్రామ్ కోసం ప్రతిష్టాత్మక ‘ఎన్సెంబల్ ఎక్సెలన్స్ అవార్డు’ను సొంతం చేసుకున్నారు. ఈ స్కాలర్షిప్ కోసం మొత్తం 272 మంది విద్యార్థులు ఆడిషన్స్‌లో పాల్గొనగా, కేవలం 14 మందికి మాత్రమే ఫుల్ స్కాలర్షిప్ లభించింది. ఇందులో సింగర్స్ విభాగం నుంచి ఈ పూర్తి స్కాలర్షిప్ దక్కించుకున్న ఏకైక విద్యార్థినిగా సుకృతి వేణి నిలవడం విశేషం. ఈ ఘనత సాధించిన సుకృతిపై ప్రస్తుతం సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
