మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నుంచి మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతున్నట్లు టాలీవుడ్లో డిస్కషన్ జరుగుతోంది. సూపర్‌స్టార్ మహేష్ బాబు(mahesh babu), డైరెక్టర్ లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj) కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే మహేష్- లోకేష్ కాంబినేషన్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరి స్టైల్‌కు మైత్రీ సంస్థ నిర్మాణ విలువలు తోడైతే ప్రాజెక్ట్ మరింత భారీ స్థాయికి వెళ్లే అవకాశం కనిపిస్తోంది.
మహేష్ బాబు ప్రస్తుతం వరుస భారీ సినిమాలతో బిజీగా ఉండగా, లోకేష్ కనగరాజ్ తన యూనిక్ యాక్షన్ టేకింగ్‌తో పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో వీరిద్దరి కలయికలో సినిమా వస్తే కథ, యాక్షన్, స్కేల్ పరంగా కొత్త అనుభూతిని అందించే అవకాశం ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు.
మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అగ్ర హీరోలు, స్టార్ డైరెక్టర్లతో భారీ సినిమాలను నిర్మిస్తూ తన లైనప్‌ను విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో మహేష్ బాబు- లోకేష్ కనగరాజ్ కాంబోపై వస్తున్న వార్త నిజమైతే ఇది టాలీవుడ్లో మరో ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్‌గా మారే అవకాశం ఉంది.
