మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘కొరియన్ కనకరాజు’ అమెరికాలో విడుదలకు సిద్ధమైంది. శ్లోక ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని యునైటెడ్ స్టేట్స్ వ్యాప్తంగా గ్రాండ్గా విడుదల చేస్తోంది.
సినిమా విడుదలకు ముందే మంచి క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతుండటం విశేషం. వరుణ్ తేజ్ గత చిత్రాల రికార్డులను ఈ బుకింగ్స్ అధిగమించడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.
మెర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఎస్. థమన్ సంగీతం అందించారు. హారర్, కామెడీ, యాక్షన్ ఎలిమెంట్స్ కలయికతో ఈ సినిమా ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని పంచనుంది. ఇందులో సత్య, రితికా నాయక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భారీ అంచనాల నడుమ అమెరికా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
