భారత్-అమెరికా: షేపింగ్ ది నెక్స్ట్ గ్లోబల్ టర్న్(US–India: Shaping the Next Global Turn) అనే థీమ్‌తో 9వ భారత్-అమెరికా సదస్సు అక్టోబర్ 8, 2026న శాంటా క్లారాలో అత్యంత వైభవంగా జరిగింది. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (AIMA) , శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ సహకారంతోయూసీ శాంటా క్రూజ్ (UC Santa Cruz) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
సదస్సు ముఖ్యాంశాలు…
కాన్సుల్ (ఎకనామిక్ & వీసా) అభిషేక్ కుమార్ శర్మ మాట్లాడుతూ.. పరిశోధన, సాంకేతికత , పెట్టుబడులలో అమెరికా సామర్థ్యాలకు భారత్ ప్రతిభ, వ్యవస్థాపక శక్తి ఎంతగానో తోడ్పడుతున్నాయని కొనియాడారు. కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, అధునాతన తయారీ రంగాలలో సహకారం ద్వారా భారత్-అమెరికా ఆవిష్కరణ కారిడార్‌ను మరింత బలపరిచే అవకాశాలపై ఆయన ప్రత్యేకంగా నొక్కిచెప్పారు. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సత్సంబంధాలు కొత్త వ్యాపార అవకాశాలను సృష్టిస్తాయని పేర్కొన్నారు. ఈ సదస్సులో యూసీ శాంటా క్రూజ్ ఛాన్సలర్ సింథియా లారివ్, AIMA డైరెక్టర్ జనరల్ రేఖా సేథి, AIMA సీనియర్ వైస్ ప్రెసిడెంట్, ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎండీ వినీత్ అగర్వాల్, అలాగే AIMA మాజీ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ ఛైర్మన్ , ది హీరో ఎంటర్ప్రైజ్ ఛైర్మన్ సునీల్ కాంత్ ముంజాల్ తదితరులు ప్రసంగించారు.

ప్యానెల్ చర్చలు, భవిష్యత్ కార్యాచరణ…
భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత లోతుగా అన్వేషించేందుకు ఈ సదస్సులో పలు కీలక అంశాలపై ప్యానెల్ చర్చలు జరిగాయి.
1. స్కేలింగ్ ఇన్నోవేషన్: సామర్థ్యాలు, సహకారం, పోటీతత్వం(Scaling Innovation: Capabilities, Collaboration and Competitive Edge)
2. రీవైర్డ్ వరల్డ్: భద్రత, శక్తి , అవకాశాలు (A Rewired World: Security, Power and Possibility)
3. వ్యాపార విధానాలు: దేశీయ ప్రాధాన్యతలు, ప్రపంచ ఏకీకరణను సమతుల్యం చేయడం (Trade That Works: Balancing Domestic Priorities and Global Integration) వంటి అంశాలపై వక్తలు విస్తృతంగా చర్చించారు.
