అమెరికన్ ఇండియా ఫౌండేషన్ తన 25 ఏళ్ల ప్రస్థానం, సాధించిన విజయాలను పురస్కరించుకుని శాన్ ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో వార్షిక టౌన్ హాల్ వేడుకను ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమం భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ , అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సహకారంతో విజయవంతంగా ముగిసింది.
ప్రముఖుల ప్రసంగాలు..
ఈ వేడుకకు కాన్సుల్ అభిషేక్ శర్మ హాజరై ప్రారంభోత్సవ ప్రసంగం చేశారు. ఆయన సందేశంతో కార్యక్రమం అత్యంత ఆసక్తికరంగా ప్రారంభమైంది.
కృత్రిమ మేధస్సుపై ప్రత్యేక ప్యానెల్ చర్చ..
కార్యక్రమంలో భాగంగా ‘కృత్రిమ మేధస్సు యుగంలో ధైర్యవంతమైన భవిష్యత్తు రూపకల్పన’ అనే అంశంపై ప్రత్యేక ప్యానెల్ చర్చ జరిగింది. అమెరికన్ ఇండియా ఫౌండేషన్ సీడీఎంఓ కల్పన కాంతన్ ఈ చర్చా గోష్టికి మోడరేటర్‌గా వ్యవహరించారు.
ప్యానెల్ నిపుణుల భాగస్వామ్యం..
ఈ చర్చలో నౌస్ రీసెర్చ్ సహ వ్యవస్థాపకురాలు శివానీ మిత్రా, బ్రిస్టల్ మేయర్స్ స్క్విబ్ ఏఐ ఇన్నోవేషన్ అండ్ పార్టనరింగ్ సీనియర్ డైరెక్టర్ సోనాల్ పాయ్, కోడ్ ఏఐ సీనియర్ మేనేజర్ , స్టాన్ఫోర్డ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్-సెంట్రిక్ ఏఐ పరిశోధకులు పాల్గొని తమ విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
