తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (TDF) బే ఏరియా ఆధ్వర్యంలో బతుకమ్మ పండగ ను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్టోబర్ 18 న మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఈ పండగ కొనసాగుతుంది. ఇక.. వేదిక విషయానికి వస్తే ‘FALLON MIDDLE SCHOOL MPR 3601 KOHNEN WAY, DUBLIN, CA 94568 లో జరుగుతుంది.
ఇక.. బతుకమ్మ పండగ సాయంత్రం 5:30 వరకు జరుగుతుంది. దీని తర్వాత బతుకమ్మ నిమజ్జనం కూడా వుంటుంది. ఎంట్రీ మాత్రం పూర్తి ఉచితంగా వుంటుందని నిర్వాహకులు ప్రకటించారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కలిసి జరుపుకోవడానికి మీ రంగుల బతుకమ్మతో రావాలని నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు.
ఇక.. ఈ కార్యక్రమానికి EMERALD SAN RAMON, EXPANDADU, FRESH MEAT FACTORY, HAYAGREEVA, HYDERABAD BIRYANI, GANESH COLLECTION SHOP వారు స్పాన్సర్ గా వున్నారు.
అలాగే V6, BIG TV, TV9 USA, TV5, STV USA, BREAKING NOW, GLOBAL TIMES, TELUGU NRI RADIO మీడియా సంస్థలు మీడియా పార్ట్ నర్స్ గా వున్నాయి.
కార్యక్రమ వివరాలు :
తేదీ : అక్టోబర్ 18
సమయం : మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 5:30 వరకు
వేదిక : ‘FALLON MIDDLE SCHOOL MPR 3601 KOHNEN WAY, DUBLIN, CA 94568
ఫ్రీ ఎంట్రీ
సాయంత్రం 5:30 తర్వాత బతుకమ్మ నిమజ్జనం
