స్పెయిన్లో కురిసిన భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టించాయి. అకస్మాత్తుగా సంభవించిన వరదల కారణంగా అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ పెను విపత్తులో ఇప్పటివరకు 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. భారీ వర్షాల కారణంగా రోడ్లు నదులను తలపించాయి. ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం కావడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇళ్లు, ఆస్తులకు భారీ నష్టం వాటిల్లినట్లు అధికారులు తెలిపారు.
సహాయక చర్యలు..
ప్రమాద స్థలాలలో రెస్క్యూ టీమ్లు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. సురక్షిత ప్రాంతాలకు బాధితులను తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే, వరద తీవ్రత ఎక్కువగా ఉండటం కొన్ని ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
