వెలుగుల పండుగ దీపావళిని పురస్కరించుకుని బే ఏరియా చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొలిసారిగా ‘రామాయణ డ్రోన్ షో’తో గ్రాండ్ ఎఫ్ఓజీ దీపావళి మేళా (FOG Diwali Mela) నిర్వహించనున్నారు. అక్టోబర్ 24వ తేదీ శనివారం ఉదయం 11 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఫ్రీమాంట్లోని వాషింగ్టన్ హైస్కూల్లో ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఈ అద్భుతమైన, మరపురాని అనుభూతిని పొందేందుకు ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరుకావాలని నిర్వాహకులు కోరారు.
కార్యక్రమ విశేషాలు…
లక్ష్మీ పూజ ప్రత్యేక దివ్య ఆశీస్సులు.
సంప్రదాయ దుస్తులు, ఆభరణాలు, నోరూరించే రుచికరమైన ఆహార పదార్థాలతో కూడిన షాపింగ్ స్టాల్స్.
సాయంత్రం 4 గంటలకు అద్భుతమైన రామాయణ పరేడ్ ప్రదర్శన.
రాత్రి 7 గంటలకు బే ఏరియా ఆకాశాన్ని అద్భుతంగా కాంతులీనేలా ప్రదర్శించే చారిత్రాత్మక రామాయణ డ్రోన్ షో(Ramayan Drone Show).
టికెట్లు, మరిన్ని వివరాల కోసం…
అధికారిక వెబ్సైట్: FOGSV.ORG లేదా EVENTMOZO.COM, SULEKHA.COM/FOG ద్వారా టికెట్లు పొందవచ్చు.
డ్రోన్ షో స్పాన్సర్షిప్ , సంప్రదింపుల కోసం రమేష్ (+1 510-593-7844) నంబర్ను సంప్రదించవచ్చు.
