అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ఫ్రెస్నోలో ఉన్న శ్రీకృష్ణ బృందావన మందిరం (హిందూ టెంపుల్ ఆఫ్ ఫ్రెస్నో) ఆధ్వర్యంలో అక్టోబర్ 16న బతుకమ్మ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతీసంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ వేడుకకు టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్, WETA ఫౌండర్ & చైర్మన్ శ్రీమతి హన్మాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు.
ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అమర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. విదేశాల్లో స్థిరపడినప్పటికీ తెలుగు ప్రజలు తమ సాంస్కృతిక వారసత్వాన్ని, సంప్రదాయాలను కాపాడుకుంటూ భావితరాలకు వాటి గొప్పతనాన్ని పరిచయం చేయడం అభినందనీయమని, ఇలాంటి వేడుకలు ఎన్నారైల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

