అమెరికాలో బే ఏరియాలో FILL THE TRUCK AND HELP OUR NEIGHBORS అన్న పేరుతో అక్టోబర్ 18 వ తేదీన ఓ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దీనికి ITserve Alliance, LS PROPERTY INVESTMENT స్పాన్సర్ గా వున్నాయి. ఈ కార్యక్రమం రెడ్నెర్స్ మార్కెట్ (Redner’s Market) 4870 Penn Ave, Sinking Spring 19608 ప్రాంతంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు జరుగుతుంది.
ఇల్లు లేని పరిస్థితిని (అనాథ/ఆశ్రయం లేని వారు) ఎదుర్కొంటున్న కుటుంబాలు మళ్లీ స్వతంత్రంగా నిలబడటానికి సహాయపడటానికి, ఫర్నిచర్, దుస్తులు మరియు గృహోపకరణాలు లేదా వీటికి అవసరమయ్యే విరాళాలను ఎవరైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వొచ్చు. దీని ద్వారా అనాథలు, పేదలకు కొంతలో కొంత ఊరట లభిస్తుంది. అయితే.. చిన్న పిల్లల ఫర్నిచర్ మాత్రం స్వీకరించమని బాధ్యులు ప్రకటించారు. మీరిచ్చే విరాళం సమాజంలో మార్పును తెస్తుంది.Sinking Springలోని Redner’s Marketలో జరగనున్న ‘Fill The Truck’ కార్యక్రమాన్ని తప్పక సందర్శించండి!

లక్ష్యానికి మద్దతునిస్తున్న LS Property Investment, LLC, ITServe CSR, ITServe Alliance మరియు Redner’s Market వారికి హృదయపూర్వక ధన్యవాదాలు ప్రకటించారు. సమాజం పట్ల మీ ఉదారత మరియు నిబద్ధత, మేము అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో ఎంతగానో సహాయపడుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
కార్యక్రమ వివరాలు :
తేదీ: ఆదివారం, అక్టోబర్ 18
స్థలం: రెడ్నెర్స్ మార్కెట్ (Redner’s Market) 4870 Penn Ave, Sinking Spring 19608
సమయం: ఉదయం 11:00 నుండి మధ్యాహ్నం 1:00 వరకు
వెబ్సైట్: www.opphouse.org
ఫోన్ నంబర్: 610-374-4696
చిరునామా: 430 North Second Street, Reading, PA 19601
