వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బే ఏరియాలో ‘సంగీత సంధ్య’ పేరుతో ప్రత్యేక సంగీత కచేరీని నిర్వహించనున్నారు. ప్రఖ్యాత గాయకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత అనూప్ జలోటా ఈ లైవ్ కన్సర్ట్‌లో పాల్గొని తమ మధురమైన గళంతో సంగీత ప్రియులను అలరించనున్నారు.
కార్యక్రమ వివరాలు..
తేదీ , సమయం: అక్టోబర్ 25, 2026, సాయంత్రం 5:00 గంటలకు ఈ సంగీత వేడుక ప్రారంభమవుతుంది.
వేదిక: ఇండియా కమ్యూనిటీ సెంటర్, 525 లాస్ కొచెన్ స్ట్రీట్, మిల్పిటాస్, సీఏ 95035.
ప్రత్యేకత..
నిరుపేద కమ్యూనిటీలకు ఉచిత వైద్య సేవలు, విద్య , పోషకాహారాన్ని అందించే వన్ వరల్డ్ వన్ ఫ్యామిలీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలకు నిధులు సమకూర్చడమే ఈ ఛారిటీ కన్సర్ట్ ప్రధాన ఉద్దేశం.
సంగీతాన్ని ఆస్వాదిస్తూనే ఒక మంచి సామాజిక సేవకు తోడ్పడే ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి హాజరుకావాలని నిర్వాహకులు కోరారు. టికెట్ల కొనుగోలు కోసం పోస్టర్‌లోని క్యూఆర్ కోడ్ లేదా ఆన్లైన్ లింక్‌ను ఉపయోగించి ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
