సిలికానాంధ్రమనబడి ఆధ్వర్యంలో “తెలుగుకు పరుగు — ప్రతి అడుగు.. అక్షరానికి అంకితం!” అనే థీమ్‌తో ‘Run4Telugu 2026’ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ 5కే వాక్/రన్ (5K Walk / Run) కార్యక్రమం అన్ని వయసుల వారికీ పూర్తిగా ఉచితమని, తెలుగు భాషను వేడుకగా జరుపుకోవడానికి కుటుంబ సభ్యులు , స్నేహితులు అందరూ కలిసి రావాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
ఈ ఈవెంట్లో రిజిస్టర్ చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఉచితంగా టీ-షర్ట్ (Free T-shirt) తో పాటు రిఫ్రెష్మెంట్లు అందజేస్తారు. బే ఏరియాలోని డబ్లిన్ (Emerald Glen Park),న్యూయార్క్ మిడిల్ స్కూల్ (Football Field, Newark), , శాన్ జోస్ (Independence High School) వంటి పలు ప్రాంతాలలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆసక్తి గల వారు http://manabadi.me/Run4Telugu వెబ్సైట్లో ముందుగా రిజిస్టర్ చేసుకోవచ్చు.
