కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ హోసే నగరంలో వెలసిన ప్రసిద్ధ శ్రీ కృష్ణ వృందావన ఆలయం(సుజ్ఞాన రిలీజియస్ అండ్ ఛారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో) అత్యంత వైభవంగా నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ఓ వైపు వేద మంత్రాలతో అర్చనాదికాలు నిర్వహిస్తూనే, మరో వైపు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ సందర్భంగా నవరాత్రుల రెండో రోజు భారత్ నుండి విచ్చేసిన ప్రఖ్యాత భరతనాట్య నూతన జంట స్నేహ నారాయణన్, యోగేష్ కుమార్ తమ అభినయ ప్రతిభతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. హృద్యమైన సంగీతంతో పాటు వారి భావ వ్యక్తీకరణతో కూడిన నృత్య రీతులు విశేషంగా ఆకట్టుకున్నాయి.తమ హావభావాలతో, శాస్త్రీయ నాట్య నైపుణ్యంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ జోడీ ప్రదర్శన ఈ వేడుకలకే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఇక… బే ఏరియాకి చెందితన నృత్య కళాకారులు కూడా విశేష ప్రతిభను కనబరిచి, మరింత ప్రకాశతత్వాన్ని అద్దారు.
