ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘పాఠశాల’ కార్యక్రమంలో 2026-27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశాలు జరుగుతున్నాయి. “దేశ భాషలందు తెలుగు లెస్స… మన తెలుగు మన పిల్లల కోసం” అనే నినాదంతో ఈ కార్యక్రమం కొనసాగుతోంది.
ఇందులో భాగంగా తెలుగు పలుకు (Level 1), తెలుగు అడుగు (Level 2), తెలుగు పరుగు (Level 3), మరియు తెలుగు వెలుగు (Level 4) అనే వివిధ స్థాయిలలో తరగతులు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి గలవారు https://paatasala.tana.org/registration లింక్ ద్వారా లేదా పోస్టర్లో ఇవ్వబడిన క్యూఆర్ కోడ్ (QR Code) ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మరింత సమాచారం కొరకు [email protected] మెయిల్ ద్వారా లేదా పోస్టర్లో సూచించిన నిర్వాహకుల ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
