తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే బతుకమ్మ వేడుకలను తెలంగాణ సాంస్కృతిక సంఘం (టిసిఎస్) ఆధ్వర్యంలో కాలిఫోర్నియాలోని కుపర్టినో నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిటీ ఆఫ్ కుపర్టినో, కుపర్టినో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సహకారంతో ఈ పూల పండుగను నిర్వహించనున్నారు. అక్టోబర్ 17, 2026 (శనివారం) ఉదయం 11:30 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు ఈ వేడుకలు జరగనున్నాయి. మెమోరియల్ పార్క్ లో నిర్వహించే ఈ వేడుకలకు అందరూ రావాల్సిందిగా టిసిఎస్ నాయకులు కోరారు.
బతుకమ్మ పోటీలను కూడా ఏర్పాటు చేశారు. అత్యుత్తమంగా పేర్చిన టాప్ 10 బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తారు. వేడుకకు విచ్చేసే భక్తులు మరియు సందర్శకుల కోసం డి ఆంజా కాలేజ్ లో ఉచిత పార్కింగ్ సౌకర్యం, వచ్చినవారికోసం రకరకాల రుచికరమైన వంటకాలతో ఫుడ్ స్టాళ్ళను కూడా ఏర్పాటు చేయనున్నారు. కాంక్రీట్ వేడి నుంచి రక్షణ కోసం సాక్స్ ధరించి రావాల్సిందిగా నిర్వాహకులు సూచించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు మరియు ఐక్యతను చాటిచెప్పే ఈ వేడుకల్లో తెలుగు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని నిర్వాహక కమిటీ సభ్యులు కోరారు.
ఇతర వివరాలకోసం ఫ్లయర్ ను చూడవచ్చు.
