అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం మౌంటైన్ హౌస్‌లో క్రీడా స్ఫూర్తి, పోటీతత్వం, అథ్లెటిక్ నైపుణ్యాలు ఉట్టిపడేలా మౌంటైన్ హౌస్ స్పోర్ట్స్ & రిక్రియేషన్ క్లబ్ (MHSRC) ఆధ్వర్యంలో 6వ వార్షిక వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్ అట్టహాసంగా జరిగింది. కోర్డెస్ విలేజ్ పార్క్ వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌కు ప్రాంతం నలుమూలల నుంచి జట్లు తరలివచ్చాయి. మౌంటైన్ హౌస్, ట్రేసీ, శాన్ రామన్, స్టాక్టన్, ప్లెసంటన్ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన జట్లు వివిధ విభాగాలలో తమ ప్రతిభను చాటుకున్నాయి.
ఉత్కంభభరితంగా సాగిన మ్యాచ్‌లు..
రోజంతా జరిగిన ఈ క్రీడా పోటీలలో అథ్లెటిక్ మ్యాచ్‌లు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. హై-ఎనర్జీ త్రోబాల్ పోటీలతో పాటు అత్యున్నత స్థాయి వాలీబాల్ డివిజన్ మ్యాచ్‌లు హోరాహోరీగా సాగాయి. ఈ టోర్నమెంట్లో విజేతలుగా నిలిచిన వారి వివరాలు ఇవే…
త్రోబాల్ డివిజన్లు:
అడ్వాన్స్డ్ డివిజన్: ఛాంపియన్స్ – డామినేటర్స్, రన్నర్స్-అప్ – రాకెట్స్.
ఇంటర్మీడియట్ డివిజన్: ఛాంపియన్స్ – ఎల్లిస్ స్ట్రైకర్, రన్నర్స్-అప్ – స్టార్ క్రాస్ స్పార్క్స్ (పిస్టాస్ జెట్టు ఫర్ఫీట్ అయింది).
బిగినర్స్ డివిజన్: ఛాంపియన్స్ – ఫీనిక్స్, రన్నర్స్-అప్ – జాగ్వార్స్.
వాలీబాల్ డివిజన్లు:
గోల్డ్ డివిజన్: ఛాంపియన్స్ – వేమేకర్స్ (స్టాక్టన్), రన్నర్స్-అప్ – ఎంహెచ్ స్పైకర్స్ (మౌంటైన్ హౌస్).
సిల్వర్ డివిజన్: ఛాంపియన్స్ – హనీ బ్యాజర్స్ (శాన్ రామన్), రన్నర్స్-అప్ – ట్రేసీ స్టార్క్రాస్ (ట్రేసీ).
బ్రాంజ్ డివిజన్: ఛాంపియన్స్ – రాయ్ గోయల్స్ (శాన్ రామన్), రన్నర్స్-అప్ – పాంథర్స్ (ప్లెసంటన్).
రిక్రియేషనల్ డివిజన్: ఛాంపియన్స్ – ఎంహెచ్ గ్లాడియేటర్స్ (మౌంటైన్ హౌస్).
వాలంటీర్ల సేవలు
ఇంతటి భారీ స్థాయి టోర్నమెంట్ విజయవంతం వెనుక కమ్యూనిటీ సభ్యుల అంకితభావం ఎంతో ఉంది. రోజంతా కార్యక్రమం సజావుగా సాగేందుకు కృషి చేసిన మురళీ బొంతు, సతీష్, రూపేష్, కృష్ణన్, శ్రావణ్ యెంపాటి, శ్రీకాంత్, కలీమ్ మహమ్మద్, బ్రిజ్ కిషోర్ రాయ్, యోగేష్ రెడ్డి, వేణు తొట్టెంపూడి, సాహితి గొడేయ్ తదితర మౌంటైన్ హౌస్ రిక్రియేషన్ క్లబ్ వాలంటీర్లతో పాటు స్థానిక విద్యార్థి వాలంటీర్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పాల్గొన్న క్రీడాకారులు , ప్రేక్షకులకు ‘స్పైసీ బైట్స్’ ద్వారా రుచికరమైన అల్పాహారం, మన్నా బిర్యానీస్ ద్వారా భోజన వసతి అందించారు.
నిర్వాహకుల కృతజ్ఞతలు…
ముగింపు వేడుకల సందర్భంగా ఫౌండర్ & చైర్మన్ సురేష్ వుయ్యూరు మాట్లాడుతూ.. 6వ వార్షిక టోర్నమెంట్‌ను మౌంటైన్ హౌస్ కమ్యూనిటీకి అఖండ విజయంగా మలచడంలో కీలక పాత్ర పోషించిన ప్రతి ఒక్కరికి, వాలంటీర్లకు, మద్దతుదారులకు, రజనీకాంత్ కాకర్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

