అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో గ్యాంగ్స్టర్ సతీందర్జీత్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ చోటు సంపాదించుకున్నాడు. పరారీలో ఉన్న టాప్ 10 మోస్ట్ వాంటెడ్ నేరస్తుల జాబితాలో 31 ఏళ్ల గోల్డీ బ్రార్ పేరును ఎఫ్బీఐ చేర్చింది. అంతేకాకుండా, అతడి ఆచూకీ తెలిపిన వారికి మిలియన్ డాలర్ల రివార్డును ప్రకటించింది.
ఎఫ్బీఐ హెచ్చరికల వివరాలు..
అమెరికాలోని పలు ప్రాంతాలతో పాటు దక్షిణ కాలిఫోర్నియా, కెనడా దేశాల్లో గోల్డీ బ్రార్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాగ్తో కలిసి అనేక హింసాత్మక ఘటనలకు పాల్పడ్డాడని ఎఫ్బీఐ వెల్లడించింది. ప్రస్తుతం అతడి వద్ద ఆయుధాలు ఉన్నాయని, అత్యంత ప్రమాదకరమైన వ్యక్తిగా గుర్తించామని తెలిపింది. అధికారుల నుంచి తప్పించుకుని పారిపోయేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాడని ఎఫ్బీఐ హెచ్చరించింది.
