లాస్ ఏంజిల్స్‌లోని భారత కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో ఆయుర్వేద దినోత్సవం-2026(Ayurveda Day 2026) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ‘People | Planet | Prevention: Ancient Wisdom for a Healthier Tomorrow’ అనే ప్రధాన థీమ్‌తో ఈ వేడుకలు జరగనున్నాయి. సంప్రదాయ ఆయుర్వేద విజ్ఞానాన్ని, హోలిస్టిక్ ఆరోగ్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
కార్యక్రమ వివరాలు…
తేదీ: అక్టోబర్ 24, 2026 (శనివారం)
సమయం: మధ్యాహ్నం 2:30 PM నుండి సాయంత్రం 6 వరకు
వేదిక: Consulate General of India, Los Angeles – 707 Wilshire Blvd., AON Center, Suite 4500, Los Angeles, CA 90017
కార్యక్రమ విశేషాలు…
స్వాగతోపన్యాసాలు
ముఖ్య అతిథుల ప్రసంగం
వెల్నెస్ ప్రదర్శన
ఆయుర్వేద ఆధారిత రిఫ్రెష్మెంట్లు
ఈ వేడుకల్లో పాల్గొనడానికి రిజిస్ట్రేషన్ కొరకు https://docs.google.com/forms/d/e/1FAIpQLSciGcd7xSqynZVRXhJGMcmSmTwBOXGt2LtQ5lTzLwV9xIi6Hg/viewform లింక్‌ను సందర్శించవచ్చు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఢిల్లీలోని అఖిల భారత ఆయుర్వేద సంస్థ, అమెరికాలోని భారత రాయబార కార్యాలయం సంయుక్తంగా ఈ కార్యక్రమానికి సహకారం అందిస్తున్నాయి.
