ఇరాన్‌తో చర్చలు జరుపుతున్న తరుణంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌పై ఆర్థిక ఆంక్షలను సడలించేందుకు లేదా నిలిపివేసిన నిధులను విడుదల చేసేందుకు తాను ఎలాంటి ప్రతిపాదన చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ ఆంక్షల ఎత్తివేతపై వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, తాను అలాంటి ఎలాంటి హామీ ఇవ్వలేదని ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్ తేల్చిచెప్పారు.
మరోవైపు ఖతార్, పాకిస్థాన్ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్‌ల మధ్య పరోక్ష చర్చలు కొనసాగుతున్నాయని అమెరికా అధికారులు తెలిపారు. అణు కార్యక్రమంపై ఇరాన్ నుంచి స్పష్టమైన హామీలు రావాలని అమెరికా కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ మాట్లాడుతూ.. హర్మూజ్ జలసంధి సంక్షోభం, ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించేందుకు న్యూయార్క్‌లో పరోక్ష చర్చలు జరిగాయని, అమెరికా స్పందన కోసం ఎదురుచూస్తున్నామని తెలిపారు.
ఇదిలా ఉండగా, సెప్టెంబర్ 14న హర్మూజ్ జలసంధిలో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ క్షిపణి దాడి జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మంది అమెరికా సైనికులు తీవ్రంగా గాయపడిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని అమెరికా ప్రభుత్వం ముందుగా బహిరంగంగా వెల్లడించలేదు. యుద్ధ తీవ్రత బయటకు రాకుండా ట్రంప్ ప్రభుత్వం ఈ సమాచారాన్ని దాచిపెట్టిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
