అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం లివర్మోర్ నగరంలో ఉన్న ప్రసిద్ధ ‘హిందూ కమ్యూనిటీ అండ్ కల్చరల్ సెంటర్’ (శివ-విష్ణు టెంపుల్) ఆధ్వర్యంలో హ్యూమన్ సర్వీసెస్ విభాగం ద్వారా ఉచిత కౌన్సెలింగ్ సేవలతో కూడిన ‘హెల్త్ అడ్వైసరీ సెంటర్’ను నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఈ ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయి.
సేవల వివరాలు , సమయం:
- ప్రతి శనివారం మధ్యాహ్నం 1:00 గంట నుండి 2:30 గంటల వరకు ఈ సేవలు అందిస్తారు.
- నిపుణులైన స్పెషలిస్ట్ డాక్టర్లు స్వచ్ఛందంగా తమ సేవలను అందిస్తారు.
- దీనికోసం ఎలాంటి ముందస్తు రిజిస్ట్రేషన్ అవసరం లేదు, నేరుగా వెళ్లవచ్చు.
ముఖ్య గమనిక:
ఈ సేవలను వాలంటీర్లుగా పనిచేస్తున్న నిపుణులైన వైద్యులు అందిస్తున్నారు. అయితే ఊహించని పరిస్థితుల కారణంగా ఈ సేవలు ఒక్కోసారి రద్దు కావచ్చని, ఇందుకు భక్తులు సహకరించాలని నిర్వాహకులు కోరుతున్నారు.
ఆలయ ప్రాంగణంలోని Building D వద్ద హెల్త్ అడ్వైసరీ సెంటర్ కోసం ఏర్పాటు చేసిన సైన్ బోర్డులను అనుసరించి అక్కడికి చేరుకోవచ్చు.
వైద్యుల పూర్తి షెడ్యూల్ కోసం [https://shorturl.at/842nl](https://shorturl.at/842nl) లింక్‌ను సందర్శించవచ్చు లేదా ఆలయ ఫ్రంట్ ఆఫీస్ నంబర్ 925-449-6255 కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు.
